Begin typing your search above and press return to search.
ఆ హీరోకి బిత్తిరి సత్తి లైఫ్ ఇచ్చాడట!
By: Tupaki Desk | 30 Jun 2019 6:30 AM GMTవిన్నంతనే విచిత్రంగా అనిపించినా ఇది నిజమని చెబుతారు మల్లేశం ఫేం ప్రియదర్శి. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హాస్యనటుడిగా కెరీర్ కంఫర్ట్ బుల్ పొజిషన్ లో ఉన్న వేళ.. హీరోగా మల్లేశం సినిమా చేసి ఎలాంటి పాత్రనైనా సరే ఈజీగా చేసేస్తానని ఫ్రూవే చేశారు ప్రియదర్శి. సినిమాలంటే పిచ్చి అయిన అతగాడికి ఫస్ట్ బ్రేక్ పెళ్లి చూపులు సినిమాలోనే.
ఈ చిత్రానికి దర్శకుడైన తరుణ్.. ఈ సినిమా ఆడిషన్స్ కు కూడా పిలవలేదట. ఎందుకంటే అప్పటివరకూ ప్రియదర్శి చేసిన పాత్రలన్ని నెగిటివ్ టచ్ ఉన్నవే. దీంతో.. పెళ్లిచూపులు మూవీలో కౌశిక్ పాత్రకు అతను సూట్ కాడన్న భావనతో పిలవలేదట. అయితే.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ప్రశాంత్ మాత్రం ఒకసారి ట్రై చేయకూడదన్న మాటతో ప్రియదర్శి ఆడిషన్స్ కు వెళ్లాడట.
స్నేహితుడైన డైరెక్టర్ పిలవకుంటే.. అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా పిలుస్తారన్న డౌట్ రావొచ్చు.. అతగాడు ప్రియదర్శికి పీజీలో క్లాస్ మేట్. దీంతో.. అలా అవకావశం వచ్చింది. ఆడిషన్స్ కు వెళ్లిన తనను తరుణ్ ఆశ్చర్యంగా చూసి.. ఆడిషన్స్ తర్వాత ఓకే చేశారట. అయితే.. తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడే క్యారెక్టర్ కావటంతో తెలంగాణ మాండలికం మీద అవగాహన కోసం చాలానే ప్రయత్నాలు చేశాడట.
సెట్ లో సిద్దిపేట కుర్రాడు అభయ్ పని చేసేవాడని. అతడి దగ్గర మాట్లాడుతూ భాషతో పాటు బాడీ లాంగ్వేజ్ ను కొంతమేర తెలుసుకున్నానని.. ఇక.. యూట్యూబ్ లో బిత్తిరిసత్తి వీడియోల్ని తెగ చూసేవాడట. నిజానికి అదే.. ప్రియదర్శికి మేలు చేయటమే కాదు.. లైఫ్ ఇచ్చినట్లుగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.