Begin typing your search above and press return to search.
ప్రియదర్శి ఈ సవాల్ ను ఎలా స్వీకరించాడో?
By: Tupaki Desk | 4 Feb 2019 5:58 AM GMT'పెళ్లి చూపులు' చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించి నవ్వులు పూయించిన ప్రియదర్శి మొదటి సినిమాతోనే స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అద్బుతమైన టైమింగ్ తో అదరగొట్టే ప్రియదర్శి ప్రస్తుతం స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసగా చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తూ ఉన్నాడు. సీరియస్ మొహం పెట్టుకుని డైలాగ్ చెప్పి నవ్వించే ప్రియదర్శి ఈసారి గుండెలు పిండేసే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక కమెడియన్ హీరోగా చేయాలనుకోవడం చాలా కామన్. అయితే కమెడియన్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి కామెడీ కాన్సెప్ట్ తో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు. కాని ప్రియదర్శి మాత్రం పద్మశ్రీ చింతకింద మల్లేశం పాత్రను చేసేందుకు ఒప్పుకుని పెద్ద సవాల్ ను స్వీకరించాడని చెప్పుకోవాలి.
గతంలో కమెడియన్స్ చాలా మంది సీరియస్ పాత్రలు పోషించారు. అయితే అందులో కొందరు మాత్రమే సఫలం అయ్యారు. ప్రియదర్శిని చూస్తేనే ఆయన గత చిత్రాల కామెడీ గుర్తుకు వచ్చి ప్రేక్షకులు నవ్వేస్తారు. అలాంటిది సీరియస్ వ్యక్తి బయోపిక్ లో నటించడం అంటే మామూలు విషయం కాదు. చేనేత కార్మికుల కష్టాలను తొలగించేందుకు ఆసు యంత్రాన్ని కనిపెట్టిన మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మల్లేశం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా విడుదల చేసిన సినిమా స్టిల్స్ ఆకట్టుకున్నాయి. మల్లేశంగా ప్రియదర్శి కనిపించగా, ఆమె తల్లిగా జాన్సి కనిపించింది. ఇద్దరు కూడా వారి పాత్రలకు బాగా సూట్ అయినట్లుగా స్టిల్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. మంచి మేకోవర్ తో ప్రియదర్శి ఫస్ట్ టెస్టులో పాస్ అయ్యాడు. ఇక నటనలో, ఆ సీరియస్ పాత్రలో, సెంటిమెంట్ సీన్స్ లో ప్రియదర్శి ఆకట్టుకుని గుండెలు పిండేసేంత సెంటిమెంట్ ను రప్పించగలడా అనేది చూడాలి.
మల్లేశం పాత్రను ఒప్పుకున్నందుకు ప్రియదర్శి ను మొదట అభినందించాల్సిందే. తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రియదర్శి ఈ చిత్రంతో సక్సెస్ అయితే మరో కమెడియన్ హీరోగా నిలదొక్కుకున్నట్లే.