Begin typing your search above and press return to search.
ప్రియదర్శి ‘పెళ్లి’ పుస్తకం
By: Tupaki Desk | 4 March 2018 8:04 AM GMTపెళ్లి చూపులు సినిమాతో పరిచయమైన ప్రియదర్శి పెళ్లి చాలా త్వరగానే జరిగిపోయింది. కెరీర్ మొదలు పెట్టిన రెండేళ్లకే వివాహం చేసుకునే నటీనటులు సాధారణంగా తక్కువగా ఉంటారు. కాని ప్రియదర్శి మాత్రం అదేమీ లేకుండా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగి తీరాలి అన్నట్టు ప్రేమ ఆ వెంటనే పెళ్లి రెండు చకచక చేసేసుకున్నాడు. ఇటీవలే వివాహ వేడుకతో పాటు రిసెప్షన్ కూడా ఇచ్చిన ప్రియదర్శి షూటింగ్స్ తో పాటు తన సోషల్ మీడియా ఎకౌంటుకు కూడా కొంత రెస్ట్ ఇచ్చాడు. తిరిగి లైన్ లోకి వచ్చాక ఒక అందమైన పిక్ ని ఫాన్స్ తో ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.
తన తలపై భార్య రిచా శర్మ తలంబ్రాలు పోస్తూ ఉండగా బుద్ధిమంతుడిలా ప్రియదర్శి తలవంచి తమకంతో ఏదో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. క్యాప్షన్ గా తాను ఫర్ ఎవర్ (ఎప్పటికీ) అని క్వశ్చన్ మార్క్ పెడితే రిచా శర్మ దానికి సమాధానంగా ఫర్ ఎవర్ అని ప్రశ్నార్థకం తీసేసి బదులు చెప్పడాన్ని మెసేజ్ రూపంలో పోస్ట్ చేసిన ప్రియదర్శి అక్కడ కూడా తన కవితాత్మక హృదయాన్ని బయట పెట్టుకున్నాడు. ఇటీవలే చెఫ్ గా కష్టమనిపించే పాత్రను అ!! లో అవలీలగా చేసిన ప్రియదర్శి అందులో నటనకు మరో పది మెట్లు పైకెక్కేసాడు. కామెడీ మాత్రమే కాకుండా మంచి ఎమోషన్స్ కూడా పండించగలనని అందులో ప్రూవ్ చేసాడు. ఇప్పుడు జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి అనే ఘట్టం కూడా ముగిసింది కాబట్టి పూర్తి దృష్టి కెరీర్ పైనే పెట్టబోతున్నాడు.