Begin typing your search above and press return to search.
రైవల్ 'సాక్షి'గా బాలయ్య సాహసం
By: Tupaki Desk | 29 Jun 2016 5:30 AM GMTకొన్ని విషయాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ రూట్ ని ఎవరూ ఫాలో కాలేరు. ఎందుకంటే ఆయన రూట్ చాలా సెపరేటుగా ఉంటుంది. ఇలాగే ఉండాలి.. ఇలాగే చేయాలి.. ఈ పద్ధతులుంటాయ్.. ఇలాంటి హంగామాని బాలయ్య ఏ మాత్రం పట్టించుకోరు. తనకు అనిపించిందా.. ఇక చేసేయడం అంతే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
కొత్త రూట్ వేయాలన్నా.. కొత్తగా ట్రై చేయాలన్నా బాలయ్య దగ్గరకు డైరెక్టర్లు పరిగెట్టడానికి రీజన్ అదే. అలాగే సినిమా రంగంలో రైవల్స్ కు వీలైనంత దూరంగా ఉండడం ఆనవాయితీ. పొలిటికల్ గా కూడా శతృత్వం ఉంటే ఇక వారితో ఎటువంటి లింక్స్ పెట్టుకోరు. సాక్షి సంస్థకు.. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి రాజకీయ వైరం తెలిసిందే. ఇలాంటి సమయంలో సాక్షితో లింక్ ఉండేలా ఓ ప్రాజెక్ట్ చేయమంటే మాటలు కాదు. కానీ మన నటసింహం అలాంటి వాటిని పట్టించుకోదు కదా.
కృష్ణవంశీ దర్శకత్వంలో తన 101 సినిమా రైతు అనే విషయాన్ని బాలయ్య ప్రకటించేశారు. అయితే.. ఈ కథను అందించినది ఎవరో కాదు.. సాక్షిలో కీలకమైన వ్యక్తి అయిన ప్రియదర్శిని రామ్. గతంలో యాక్టర్ కం డైరెక్టర్ గా ట్రై చేశాడు కానీ.. ఈయన సక్సెస్ కాలేకపోయాడు. అలాగే రామ్ ని జగన్ కి సన్నిహితుడు అని కూడా అంటారు. ఇలా తమకు రాజకీయంగా ఏమాత్రం గిట్టని వ్యక్తి ఇచ్చిన కథతో.. తమ పార్టీని అనుక్షణం తిట్టిపోసే ఛానల్ ని నడుపుతున్న వ్యక్తి ఇచ్చి స్టోరీతో.. బాలకృష్ణ సినిమా చేసేందుకు అంగీకరించడం విశేషమే. బాలయ్య దృష్టిలో సినిమాలు రాజకీయాలు వేరువేరు అని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం కావాలా?