Begin typing your search above and press return to search.
పుట్టినింటికొచ్చింది అందుకేనా పీసీ?
By: Tupaki Desk | 2 Nov 2022 1:47 PM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత ఇండియాకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఉన్నట్లుండి అమెరికా కోడలు ఇండియాకి ఎందుకొచ్చినట్లు? ఇండియాకి వెకేషన్ కి వచ్చిందా? లేక దేశం పై మమకారంతో కాలు పెట్టిందా? అంటూ రకరకాల సందేహాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. విషయంలోకి వెళ్తే కోవిడ్ తోనే రెండేళ్లు గడిచిపోయంది. అంతకు ముందే పీసీ అమెరికాలో ఉంది.
అప్పటి నుంచి మళ్లీ మధ్యలో ఇండియాకి తిరిగొచ్చింది లేదు. సంసార జీవితంలోనే మునిగిపోయింది. మధ్యలో హాలీవుడ్ సినిమాలతోనూ కాలక్షేపం చేసింది. అయితే అమ్ముడిప్పుడు ఇండియాకి తిరిగి రావడం వెనుక చాలా కథే ఉందని తెలుస్తోంది. పీసీ కమిట్ అయిన హిందీ సినిమాలు మొత్తం పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే తిరిగొచ్చినట్లు కనిపిస్తుంది.
వస్తూనే బాలీవుడ్ లో చేయాల్సిన పాత ప్రాజెక్ట్ లు.. కొత్త సినిమాల చర్చల్లో తలమునకలైంది. పీసీ గతంలోనే విశాల్ భరద్వాజ్..సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వలో సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. అలాగే ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా సంతకం చేసినట్లు సమాచారం. ఇంకా పలు ప్రాజెక్ట్ లు చర్చల్లో ఉన్నాయి.
త్వరలో ముంబైలో వీళ్లంతో కలిసి చర్చలు జరపనుందని తెలుస్తోంది. ప్రఖ్యాత కవి..పాటల రచయిత సాహిర్ లుథ్వానీ జీవితం ఆధారంగా భన్సాలీ ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఇది ఆయన కలల ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఇందులో పీసీ మెయిన్ లీడ్ లో కనిపించనుందని సమాచారం. కత్రినా కైఫ్..అలియా భట్ లతో కలిసి ఓ లేడీఓ రియేంటెడ్ సినిమ కూడా చేయాల్సి ఉంది.
అలాగే కోవిడ్ కారణంగా అర్ధంతరం గా నిలిచిపోయిన 'జీలే జరా' వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి పర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి కాకుండా పీసీ పలువురు దర్శకులకు కమిట్ మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. వాటిపై చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కుదిరితే అన్నింటికి ఒకేసారి డేట్లు సర్దు బాటుచేసే ఆలోచనలోనూ ఉన్నట్లు కనిపిస్తుంది.
వీలైనంత త్వరగా అన్నింటిని పూర్తిచేసి పుట్టినింట్టి నుంచి మళ్లీ తిరిగి మెట్టినింటికి వెళ్లిపోయే ఆత్రం పీసీ లో కనిపిస్తోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇలా తొందరపడితే ఎలా పీసీ? అమ్మడి గ్లోబల్ క్రేజ్ చూసి దర్శక దిగ్గజం రాజమౌళి సైతం తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆశపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.