Begin typing your search above and press return to search.

భావన వేడుకలో ప్రియమైన జంట

By:  Tupaki Desk   |   5 Feb 2018 11:30 PM GMT
భావన వేడుకలో ప్రియమైన జంట
X
ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందమైన మల్లూ బ్యూటి భావన ఇక్కడ బారి సినిమాల్లో నటించలేదు గాని కోలీవుడ్ మలయాళం లో మాత్రం కొంచెం పెద్ద సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య ఓ వివాదం వలన కెరీర్ పరంగా సతమతమైన భావన ఎట్టకేలకు తన పెళ్లితో అంతా కూల్ గా సెట్ అయ్యేలా చేసుకుంది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం పార్టీలతో ఎంజాయ్ చేస్తోంది.

రీసెంట్ గా భావన - నవీన్ ల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. కొంత మంది సినీ తారలు రాజకీయ ప్రముఖులు అలాగే వ్యాపారవేత్తలు పార్టీకి ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. అయితే పార్టీలో ఎక్కువసేపు సందడి చేసింది మాత్రం ప్రియమణి దంపతులే. ప్రియమణి - ముస్తఫా రాజ్ ల వివాహం గత ఏడాది ఆగస్టు లోనే జరిగింది. ఇక వీరిద్దరూ భావన ఇచ్చిన పార్టీలో ప్రత్యేకంగా నిలిచారు.

వారికి తోడుగా పారుల్ యాదవ్ కూడా జత కలిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళం కన్నడ సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే ఈ హీరోయిన్స్ కు భావనతో మంచి రిలేషన్ ఉండడంతో రిసెప్షెన్ లో సందడి చేశారు. ఇక చివరగా కొన్ని సెల్ఫీలకు స్టిల్స్ కూడా ఇచ్చారు. ఇక పెళ్లైన కూడా భావన ప్రియమణి సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.