Begin typing your search above and press return to search.

దిష్ఠి తీయించుకోవమ్మా డస్కీ బ్యూటి

By:  Tupaki Desk   |   15 July 2015 10:18 PM IST
దిష్ఠి తీయించుకోవమ్మా డస్కీ బ్యూటి
X
మొన్ననే ఓ బాంబు పేల్చింది డస్కీ బ్యూటి ప్రియమణి. భారీ యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్నా కూడా అమ్మడు అనవసరమైన భారీ ఎక్స్‌పోజింగ్‌ జోలికి పోయి తన కెరియర్‌ను ఓ విధంగా నాశనం చేసుకుంది. అనవసరమైన బికినీ షో లకు పోయి మంచి మంచి సినిమా అవకాశాలను పోగొట్టుకుంది. ఇక ఒకసారి బికినీ వేస్తే టాలీవుడ్‌లో అలాంటి బి-గ్రేడ్‌ సినిమాలే వస్తాయి మరి. సో అక్కడితో అమ్మడ ఖేల్‌ సైడ్‌ ట్రాక్‌ ఎక్కేసింది.

ఇకపోతే మొన్ననే అమ్మడు ఓ టివి కార్యక్రమంలో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ముంబయ్‌కు చెందిన ముస్తఫా రాజ్‌ అనే ఈవెంట్‌ మేనేజర్‌తో అమ్మడు ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. నాలుగేళ్ళ నుండి ఇద్దరూ లవ్‌ చేసుకుంటున్నారట. బహుశా ప్రియమణి సినిమాలు లేకుండా ఖాళీగా ఉండటం అప్పటినుండే కాబోలు.. ఇక మన దిష్ఠి మ్యాటర్‌లోకి దిగిపోదాం. మన సౌత్‌లో ఓ సెంటిమెంట్‌ ఉంది. మేం కపుల్‌ అని ఎవరైనా సెలబ్రిటీలు బయటకు చెప్పుకుంటే చాలు.. వెంటనే బ్రేకప్‌ అయిపోతున్నారు.

సిద్దూతో రిలేషన్‌లో ఉన్నట్లు పబ్లిక్కుగా ఒప్పుకోలేదు కాని, ఇండస్ట్రీలోని సన్నిహితులకు మ్యాటర్‌ బాగానే చేరవేసింది సమంత. అందరికీ తెలిసిన కొన్ని రోజులకే ఈ రిలేషన్‌ ఢమాల్‌ అనేసింది. పబ్లిక్‌గా తమ రిలేషన్‌గా గురించి ట్విట్టర్‌లో హగ్స్‌ ఇచ్చుకున్న శింబు-హన్సిక పరిస్థితి కూడా ఇంతే. ఇవన్నీ చూస్తుంటే ప్రియమణి లవ్‌ గురించి ఆమె అభిమానులు భయపడుతున్నారు. సైలెంటుగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు రివీల్‌ చేసిందో అని ఫీలవుతున్నారు. ఏమ్మా ప్రియమణి.. జాగ్రత్తే.. లేకపోతే దిష్టి తీయించుకో..