Begin typing your search above and press return to search.

ఆమె భర్తే ఆమె మేనేజర్‌

By:  Tupaki Desk   |   25 July 2020 2:00 PM GMT
ఆమె భర్తే ఆమె మేనేజర్‌
X
సినిమా నటీ నటులకు మేనేజర్స్‌ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కాస్త ఫేమస్‌ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మేనేజర్స్‌ ను నియమించుకుంటూ ఉంటారు. ఆ మేనేజర్స్‌ డేట్లు పారితోషికం ఇతరత్ర విషయాలను చూసుకుంటూ ఉంటారు. మేనేజర్స్‌ లేకుండా స్టార్స్‌ మేనేజ్‌ చేసుకోవడం అనేది చాలా కష్టమే. కొందరికి తమ వాళ్లే మేనేజర్స్‌ గా ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కు ఆమె సోదరి అయిన రంగోలినే మేనేజర్‌. అలాగే సౌత్‌ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియమణికి కూడా ఆమె భర్తే మేనేజర్‌ గా చేస్తున్నాడట.

పరుత్తి వీరన్‌ చిత్రంలో అద్బుత నటనకు గాను జాతీయ అవార్డు దక్కించుకున్న ప్రియమణి బాలీవుడ్‌ టాలీవుడ్‌ కోలీవుడ్‌ ఇలా అన్ని చోట్ల తనదైన ముద్రను వేసింది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈమె ఇంకా బిజీ బిజీగానే గడిపేస్తుంది. తెలుగులో విరాటపర్వం మరియు నారప్ప చిత్రాల్లో నటించిన ఈమె హిందీలో మైదాన్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఇక బుల్లి తెరపై కూడా ఈమె ‘ఢీ’ అంటూ కనిపిస్తుంది. ఇలా వరుసగా షోలు సినిమాలు చేస్తున్న ప్రియమణి డేట్లను ఆమె భర్త అయిన ముస్తఫా రాజ్‌ చూస్తాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. తన కోసం ముస్తఫా చాలా కష్టపడతాడంటూ పేర్కొంది. ఒక హీరోయిన్‌ కు ఆమె భర్తే మేనేజర్‌ అవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.