Begin typing your search above and press return to search.
పొమ్మనే వరకూ నటిస్తూనే ఉంటా
By: Tupaki Desk | 4 Oct 2016 5:33 AM GMT13 ఏళ్ల క్రితం తమిళ్ సినిమాతో అరంగేట్రం చేసిన ప్రియమణి.. మొదట్లోనే ఫ్లాప్ ఎదురుకావడంతో.. కోలీవుడ్ వదిలేసి మల్లూవుడ్ చేరుకుని.. అక్కడ కూడా సరైన ఆఫర్స్ రాక.. చివరకు తెలుగులో అరంగేట్రం చేసింది. పెళ్లైన కొత్తలో అంటూ జగపతిబాబు కలిసి ప్రియమణి చేసిన సందడికి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి బాగానే ఆదరణ దక్కింది. ఆ తర్వాత తెలుగు.. తమిళ్.. మలయాళం.. కన్నడ.. హిందీ అంటూ మొత్తం ఐదు భాషల్లో నటించేసింది. ఇప్పుడు మనవూరి రామాయణం అంటూ ప్రకాష్ రాజ్ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది ప్రియమణి.
ఈ బెంగళూరు భామ కెరీర్ లో అటు గ్లామర్ రోల్స్ తో పాటు.. ఇటు పెర్ఫామెన్స్ బేస్డ్ అవార్డ్ విన్నింగ్ కేరక్టర్స్ కూడా ఉన్నాయి. 'ప్రతీ ఇండస్ట్రీకి కల్చరల్ గా ప్రత్యేకత ఉన్నా నా వరకు భాషతో ఏ ప్రాబ్లెం రాలేదు. నేను నా డైరెక్టర్.. హీరోలతో పాటు నా పాత్ర పరిధిని మాత్రమే పట్టించుకుంటాను. కేవలం కమర్షియల్ హిట్స్ సాధిస్తే.. తర్వాత నటిగా సంతృప్తి మిగలకపోవచ్చు. అందుకే నటనలో ట్యాలెంట్ చూపించే అవకాశం ఉన్న రోల్స్ వచ్చినపుడు చేశాను' అంటోంది ప్రియమణి. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా.. ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేసినంత కాలం నటిస్తూనే ఉంటానని.. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయబోనని చెప్పింది.
ఐదు పాటలు.. 10 ఫైట్లు అంటూ కమర్షియల్ రూట్లో మనవూరి రామాయణం మూవీ ఉండదని.. ప్రతీ ఒక్కరు తమను తాము చూసుకునే ఉంటుందన్న ప్రియమణి.. ఇలాంటి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు.. ప్రస్తుతం చాలామంది ఉన్నారని అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/