Begin typing your search above and press return to search.

శ్వేతాబసు కోసం ప్రియమణి పాట

By:  Tupaki Desk   |   7 Jan 2016 4:51 PM GMT
శ్వేతాబసు కోసం ప్రియమణి పాట
X
ఈ తరం నటులు ఎందులో అయినా తమకు సాటి లేదని ప్రూవ్ చేసేసుకుంటున్నారు. గతంలో సినిమా అంటే యాక్టింగ్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మరిన్ని పాట్లు పడాల్సిందే. వచ్చినా రాకపోయినా కొత్తగా ట్రై చేసేయాల్సిందే.

హీరో హీరోయిన్లు పాటలు పాడ్డం కూడా రీసెంట్ ట్రెండ్ అయిపోతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం గొంతు సవరించుకున్నాడు. టాలీవుడ్ లో కొన్ని పాటలు పాడిన ఎక్స్ పీరియన్స్ ఉండడంతో.. ఈ ఫీట్ యంగ్ టైగర్ కు అంత కష్టమేం కాలేదు. ఆ తర్వాత కాజల్ కూడా తమన్ అడిగాడని, ఎన్టీఆర్ పాడిన సినిమాలోనే తనూ ఓ సాంగ్ సింగింది. ఇప్పుడు ప్రియమణి వంతు వచ్చింది. విచిత్రంగా ఈమె కూడా ఓ కన్నడ పాడడమే విశేషం.

ఈ విషయాన్ని ప్రియమణి స్వయంగా ట్టిట్టర్ ద్వారా చెప్పింది. అంతే కాదు ఓ ఫోటో పోస్ట్ చేసి దానితో పాటు 'ఇవాల కొత్త కిరీటం తగిలించున్నా. ఓ కన్నడ మూవీ కోసం తొలిసారిగా పాట పాడా' అంటూ ట్వీటింది. ఈమె దేవరన్వే బుడు గురు మూవీ కోసం ఇలా కొత్త అవతారం ఎత్తింది. ఓ సెక్స్ స్కాండల్ లో ఇరుక్కుని బయటపడ్డ శ్వేతాబసు.. దేవరన్వే బుడు గురు చిత్రంలో ఓ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుండడం విశేషం. శ్వేతాబసుకు ఇది రీఎంట్రీ అనే చెప్పాలి. ఒకవైపు ప్రియమణికి సింగర్ గా ఎంట్రీ, మరోవైపు శ్వేతాబసుకి రీఎంట్రీ.. టాలీవుడ్ లో మెరిసిన మాయమైన వీరికి ఇది ఓ రకంగా కీలకమైన చిత్రం అంటున్నారు.