Begin typing your search above and press return to search.

షారుక్ తో ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ వ‌న్ ..టూ..త్రీ!

By:  Tupaki Desk   |   25 Nov 2022 3:30 PM GMT
షారుక్ తో ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ వ‌న్ ..టూ..త్రీ!
X
బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో 'జ‌వాన్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పై అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి. సౌత్ మార్కెట్ టార్గెట్ గా షారుక్ జ‌వాన్ సినిమా చేస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా న‌య‌న‌తార ఎంపిక చేసుకున్నారు. ద‌ర్శ‌కుడిగా అట్లీని రంగంలోకి దించాడు. చెన్నై ఎక్స్ ప్రెస్ లా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ తో సౌత్ ని మోతెక్కించాల‌న్న‌ది షారుక్ ప్లాన్ గా క‌నిపిస్తుంది.

అందుకే సినిమాలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి సైతం న‌టిస్తున్నాడు. ఇందులో సేతుప‌తి విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఇలా ప్ర‌తీ విష‌యంలో షారుక్ సౌత్ స్ర్టాట‌జీ క‌నిపిస్తుంది.

అట్లీ మేకింగ్ కి దేశ వ్యాప్తంగా మంచి పేరుంది. యంగ్ మేక‌ర్ నుంచి మ‌రో అద్భుత‌మే వస్తుంద‌ని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి సినిమాలో సౌత్ ని ఆక‌ర్షించే మాస్ ఐట‌మ్ లేక‌పోతే ఎలా? అలాంటి ఊపేసే సాంగ్ కూడా ఒక‌టి కావాలిగా.

అందుకే అట్లీ జ‌వాన్ లో అలాంటి పాట‌ని ప్లాన్ చేసాడు. షారుక్ స‌ర‌స‌న ఓ హాట్ బ్యూటీని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ మె ఎవ‌రో కాదు ప్రియ‌మ‌ణి ని ఖ‌రారు చేసారు.

చెన్నై ఎక్స్ ప్రెస్ త‌ర‌హాలో ఇద్ద‌రి మ‌ధ్య మంచి పాట‌ని డిజైన్ చేసారుట‌. అయితే ఇందులో ప్రియ‌మ‌ణి స్థానంలో మ‌రో హీరోయిన్ తీసుకోవాల‌న్న‌ది అట్లీ ప్లాన్ అట‌. కానీ షారుక్ అందుకు ఒప్పుకోలేదుట‌.

ప్రియ‌మ‌ణి అయితేనే ది బెస్ట్ అందించ‌గ‌ల‌ద‌ని..ఆమెనే ఎంపిక చేయండ‌ని సూచించ‌డంతో మ‌రోసారి షారుక్ స‌ర‌స‌న మెరిసే ఛాన్స్ అందుకుంది. పైగా ప్రియ‌మ‌ణిని షారుక్ సెంటిమెంట్ గానూ భావించిన‌ట్లు తెలుస్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్ విజ‌యంతో ఇండియానే షేక్ చేసింది. అందులో ప్రియ‌మ‌ణి న‌ర్తించ‌డం సెంటిమెంట్ గా భావించి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. షారుక్ కల్పించిన ఈ అవ‌కాశాన్ని ప్రియ‌మ‌ణి త‌ప్ప‌క స‌ద్వినియోగం చేసుకోదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.