Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ రియాక్షన్ కు అమ్మడికి తిక్క రేగింది

By:  Tupaki Desk   |   31 May 2016 3:45 PM IST
ఫ్యాన్స్ రియాక్షన్ కు అమ్మడికి తిక్క రేగింది
X
ఫ్యాన్స్ గా అభిమానించాలే కానీ.. ఆ పేరుతో పర్సనల్ లైఫ్ లోకి వచ్చేయటం ఏమిటంటూ కస్సుమంటోంది హీరోయిన్ ప్రియమణి. తాను మనసుపడి ప్రేమించిన తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫాను పెళ్లి చేసుకోనున్న విషయాన్ని హ్యాపీ మూడ్ తో ట్వీట్ చేసిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అమ్మడి లవ్ మ్యాటర్ ను సోషల్ మీడియాలో మిక్సెడ్ రెస్పాన్స్ రావటం ఒక ఎత్తు అయితే.. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలపై కొందరు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయటంపై ఆమె మండిపడుతోంది.

తన బాయ్ ఫ్రెండ్ ముస్లిం కావటం.. వారి ప్రేమను లవ్ జిహాదీతో పోలుస్తూ చేసిన కామెంట్ల పై ప్రియమణి కన్నెర్ర చేస్తోంది. వారి మాటలు తనను హర్ట్ చేసినట్లుగా చెబుతున్న ప్రియమణి.. కొత్త లైఫ్ లోకి అడుగుపెడుతున్న వేళ ఈ తరహా కామెంట్లు రావటం బాధాకరమని వ్యాఖ్యానించారు. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే.. సంతోషంగా దీవించాల్సింది పోయి.. ఇలా కించపరుస్తారా అంటూ గస్సా అయిన ఆమె.. నెగిటివ్ రియాక్షన్స్ వద్దని.. తన లవ్ విషయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే సమాధానం చెప్పాలే కానీ.. మీకు కాదనటమే కాదు.. నా లైఫ్ నా ఇష్టం.. మధ్యలో మీరేంటంటూ ఓ రేంజ్ లో మండిపడుతోంది. మనసుకు నచ్చిన వాడిని వంక పెడితే ఏ ప్రేయసి మాత్రం ఊరుకుంటుంది చెప్పండి.