Begin typing your search above and press return to search.

ఇలాంటి పిక్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టాలా?

By:  Tupaki Desk   |   8 April 2020 7:31 AM GMT
ఇలాంటి పిక్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టాలా?
X
ప్రేమను దాచడం లేదు.. ఎఫైర్స్ ను గుట్టుగా ఉంచడం లేదు. అంతా ఓపెన్. ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో ఎవరేమనుకున్నా సరే తమ ప్రియుడితో కలిసే ఉంటామని చాలా మంది నిరూపించారు. తాజాగా బిగ్ బాస్ 11 సీజన్ లో ప్రేమలో పడ్డ ప్రియాంక్ శర్మ - బెనఫ్ షా సూనావాలా మధ్య రోమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ లో చూపులు కలిసిన వీరు బయటకొచ్చాక పీకల్లోతూ ప్రేమలో కూరుకు పోయారు. తమపై రూమర్లు వస్తున్నా వాటికి చెక్ చెప్పకుండా తాజాగా బహిరంగంగా తమ రోమాంటిక్ పిక్ ను షేర్ చేసి సంచలనం సృష్టించారు.

బేనఫ్ షా తాజాగా ప్రియాంక్ శర్మతో ఘాడ చుంబనంలో నేలపై పడుకొని పెట్టుకున్న ముద్దు సన్నివేశాన్ని ఫొటో తీయించుకొని ఏకంగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడం చర్చనీయాంశమైంది. మా మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఇదేనని ఎమోజీని పోస్టు చేశారు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

ఇక ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్టు గురించి బెనఫ్ షా సూనావాలా స్పందించారు. నా ప్రేమ చాలా స్వచ్ఛమైనది.. నిన్ను ఇష్టపడినట్టు మరొకరని ఇష్ట పడలేదంటూ పోస్టుకు బదిలిచ్చాడు.

ఇలా బహిరంగంగా ముద్దులిచ్చుకొని రోమాన్స్ చేసిన వీరి ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.