Begin typing your search above and press return to search.
OG : ముద్దుగుమ్మకి అంతకు ముందు ఆ తర్వాత
By: Tupaki Desk | 22 April 2023 2:03 PM GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాహో సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పాల్గొంటున్న విషయం తెల్సిందే.
ప్రియాంక అరుల్ మోహన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసిన సినిమాలు ఆరు. అందులో తెలుగు సినిమాలు నాని గ్యాంగ్ లీడర్.. శ్రీకారం. ఆ రెండు సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా తెలుగు లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.
అనూహ్యంగా ప్రియాంక కు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరగడంతో పాటు ఆఫర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కోటి లోపు పారితోషికంతో ఇన్నాళ్ల కెరీర్ ను కొనసాగిస్తున్న ప్రియాంక మోహన్ పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది.
ఓటీ విడుదలకు ముందే ఈ రేంజ్ లో క్రేజ్ పెరిగితే ముందు ముందు ప్రియాంక అరుల్ మోహన్ యొక్క గ్రాఫ్ ఎలా పెరుగుతుందో కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ తో సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి రెండు మూడు ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ప్రియాంక కెరీర్ పరంగా టాప్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.