Begin typing your search above and press return to search.
పీసీ 75 అడుగుల ట్రెయిన్ డ్రెస్
By: Tupaki Desk | 6 Dec 2018 5:28 AM GMTపెళ్లంటే పెళ్లి కాదు. అలాంటిలాంటి పెళ్లి కాదు. వింత వింత విడ్డూరాల పెళ్లి ఇది. దీనిని నిక్యాంక పెళ్లి అంటూ అభిమానులు ఎంతో సంబరంగా చెప్పుకుంటున్నారు. డిసెంబర్ 1, 2 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ ట్రెడిషనల్ స్టైల్లో పెళ్లి వేడుక జరిగింది. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట ఈ సంబరాల్ని ఓ రేంజులో ఎంజాయ్ చేశారు. అయితే ఆ ఫోటోలేవీ పూర్తి స్థాయి లో అభిమానుల ముందుకు రాలేదు.
వీటిని గంపగుత్తగా ప్రఖ్యాత `హలో` మ్యాగజైన్ గుత్తకు తీసుకుని మరీ రిలీజ్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఫోటోలు ఒక్కొక్కటి గా బయటకు వస్తున్నాయి. వీటి లో తాజాగా రివీల్ చేసిన ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీసీ- నిక్ జోడీ క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ లో ఓ ప్రత్యేకత ఉంది. ఆ శుభముహూర్తంలో పీసీ 75 అడుగుల పొడవాటి ట్రెయిన్ లాంటి డ్రెస్ ని ధరించింది. దీనిని ప్రఖ్యాత రాల్ఫ్ లారెన్ వెడ్డింగ్ గౌన్ అని పిలుస్తున్నారు. వధువు డ్రెస్ చూసి వరుడు చాలా గమ్మత్తయిన ఎక్స్ ప్రెషన్‌నే ఇచ్చాడు. ప్రస్తుతం కొత్త జంట ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.
పీసీ వివాహానంతరం హాలీవుడ్ లో సెటిలవుతుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. హాలీవుడ్ ఫేమస్ స్టార్లు కొలువున్న ఆ కుటుంబం వల్ల తనకు మహర్ధశ పట్టినట్టేనన్నది అభిమానుల అంచనా. ఈ పెళ్లిలో పలువురు హాలీవుడ్ స్టార్లు సందడి చేశారు. వీళ్లంతా ఇండియన్ స్టైల్ వెడ్డింగ్‌ని బాగా ఎంజాయ్ చేశారని ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.