Begin typing your search above and press return to search.

హౌ క్రేజీ! హాలీవుడ్ త్రిఏంజెల్స్ లా దుమ్ము దులుపుతారా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 11:30 PM GMT
హౌ క్రేజీ! హాలీవుడ్ త్రిఏంజెల్స్ లా దుమ్ము దులుపుతారా?
X
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా జోనస్.. అలియా భట్.. కత్రినా కైఫ్ .. ఈ ముగ్గురూ బాలీవుడ్ లో ఎదురే లేని క‌థానాయిక‌లుగా కెరీర్ ని సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. పీసీ ఇటీవ‌ల హాలీవుడ్ లోనూ బిజీగా ఉన్నారు. అయితే ఆ ముగ్గురిని క‌లిపి హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ త్రీఏంజెల్స్ త‌ర‌హాలో భారీ ప్ర‌యోగం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిని క‌లుపుతూ ప్ర‌ముఖ దర్శ‌క‌నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా`లో నటింప‌జేసేందుకు ఒప్పించారు

ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ .. టైగర్ బేబీ ఫిల్మ్స్ కి చెందిన ఫర్హాన్ అక్తర్ .. రితేష్ సిధ్వాణీ ఈ ప్రాజెక్టును లాక్ చేశారు. దిల్ చాహ్తా హై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫర్హాన్ అక్తర్ ఒక వీడియో ద్వారా ప్రకటన చేయడానికి ట్విట్టర్ లోకి వెళ్లారు.

``ఎవరైనా రోడ్ ట్రిప్ వెళ‌దామ‌ని చెప్పారా? దర్శకుడిగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం థ్రిల్లింగ్ గా ఉంది. దిల్ చాహ్తా హాయ్ 20 సంవత్సరాల చ‌రిత్ర‌ను క‌లిగి ఉంది. అంత‌ కంటే మెరుగైన రోజు ఒక‌టి రావాలి. అది మేం చేయాలి. #జీలే జ‌రా ఆ త‌ర‌హానే అని ప్ర‌క‌టించారు ఫ‌ర్హాన్‌. 2022 లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. ఈ ప్రదర్శన కోసం వేచి ఉండండి అంటూ టీజ్ చేశారు. వీడియోలోని నేపథ్య సంగీతం వెన్ చాయ్ మెట్ టోస్ట్ పాటను ప్లే చేస్తూ ఫైర్ ఫ్లై అంటూ వ్యాఖ్యానించారు.

దిల్ చాహ్తా హై - జిందగీ నా మిలెగి దోబారా తర్వాత ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ టైగర్ బేబీ సహకారంతో ఈ తరహా గాళ్స్ ఫ్రాంఛైజీని విస్తరిస్తోంది. టాప్ మేకర్స్ బిగ్ బ్యాంగ్ తో తిరిగి వచ్చారు. ఇది ఖచ్చితంగా జోయా అక్తర్ - ఫర్హాన్ అక్తర్- రీమా కాగ్టి ర‌చ‌న‌ల్లో 2021 అతిపెద్ద ప్రకటనగా నిలుస్తుంది. రీమా కాగ్టి- జోయా అక్తర్- రితేష్ సిధ్వాని - ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తారు. 2023 లో విడుదల అవుతుంది. రోడ్ ట్రిప్ మూవీ.. రోడ్ లో బోలెడ‌న్ని ఫీట్స్ ఉంటాయి. మీ సీట్ బెల్ట్ లను బిగించండి.. అమ్మాయిలు కారును బయటకు తీసే సమయం ఆసన్నమైంది! అంటూ నెటిజ‌నులు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. ఇప్ప‌టికి ఇచ్చిన హింట్ ని బ‌ట్టి హాలీవుడ్ త్రీ ఏంజెల్స్ త‌ర‌హాలో అద్భుత‌మైన యాక్ష‌న్ ట్రీట్ ని ఈ ముగ్గురు అంద‌మైన అమ్మాయిలు ఆడియెన్ కి ఇవ్వ‌బోతున్నార‌ని గెస్ చేయొచ్చు. 3 ఏంజెల్స్ చిత్రం గ‌రానా అమ్మాయిల డిటెక్టివ్ స్టోరి. అందుకు భిన్నంగా రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో ఫ‌ర్హాన్ మూవీ ఉంటుంద‌న్న‌మాట‌.

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను 1999 లో రితేష్ సిద్ధవానీ -ఫర్హాన్ అక్తర్ స్థాపించారు. దిల్ చాహ్తా హై - రాక్ ఆన్ వంటి వారి మొదటి జంట చిత్రాలకు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. గల్లీ బాయ్ 92 వ అకాడమీ అవార్డ్స్ లో భారతదేశం త‌ర‌పున‌ అధికారిక ఎంట్రీ కి వెళ్లింది. ఈ జోడీ ఎప్పుడూ ఏం చేసినా అది ఒక సంచ‌ల‌న‌మే. ఇప్పుడు బాలీవుడ్ అతిపెద్ద స్టార్ హీరోయిన్ల‌ను క‌లిపి యూనిక్ ఫ్రాంఛైజీని డిజైన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.