Begin typing your search above and press return to search.

అదంతా చూపించటమే లేటెస్ట్ ట్రెండా?

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:02 AM GMT
అదంతా చూపించటమే లేటెస్ట్ ట్రెండా?
X
వారం వ్యవధిలో ఇద్దరు బాలీవుడ్ భామలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమ అందంతో జనాలకు పిచ్చెక్కించేస్తున్నారు. ఒక అవార్డు ఫంక్షన్ (గోల్డెన్ గ్లోబ్) కు అతిధిగా వెళ్లిన ప్రియాంక చోప్రా ధరించిన గోల్డ్ కలర్ డ్రెస్ లో అమ్మడి క్లీవేజ్ షో ప్రదర్శనతో ఇంత చలిలోనే ఒళ్లంతా సెగలు పొగలు పుట్టేసే పరిస్థితి. ప్రియాంక ఫోటోలు జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. అది సరిపోనట్లు తాజాగా దీపిక వేసుకున్న డ్రెస్సు మరో సంచలనంగా మారింది.

తాను నటించిన ట్రిపుల్ ఎక్స్ హాలీవుడ్ మూవీ ప్రీమియర్ షోను ముంబయిలో ఏర్పాటు చేయగా.. ఆ కార్యక్రమానికి దీపిక వేసుకున్న గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాంక్ అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. వారం వ్యవధిలో ఇద్దరు ముద్దుగుమ్మలు వేసుకున్న డ్రెస్సు కలర్ ఇంచుమించు ఒకేలా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఇద్దరూ క్లీవేజ్ ను ఫుల్ గా ఓపెన్ చేసేసి.. చూపించిన వైనం మతి పోగొట్టేలా చేస్తుంది.

ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రదర్శిస్తున్న అందాల.. రసిక హృదయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చూస్తుంటే క్లీవేజ్ ను మొత్తంగా ఓపెన్ చేసి చూపించటం సరికొత్త ట్రెండ్ గా మారినట్లు కనిపిస్తోంది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఇన్నేసి అందాలు కళ్ల ముందు కనిపిస్తూ.. ప్రపంచానికి చూపించాల్సిన వేళ.. కెమేరామెన్ల కష్టం అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంది. ఇన్ని అందాల్ని క్యాప్చర్ చేసేందుకు వారు పడుతున్న శ్రమకు నిదర్శనంగా వేళ్లు నొప్పులు పుట్టిస్తున్నాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/