Begin typing your search above and press return to search.

BAFTA అవార్డుల్లో ప్రియాంక చోప్రా జోనాస్ మూవీ హ‌వా?

By:  Tupaki Desk   |   6 Feb 2021 5:30 PM GMT
BAFTA అవార్డుల్లో ప్రియాంక చోప్రా జోనాస్ మూవీ హ‌వా?
X
పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా జోనాస్ న‌టించిన `ది వైట్ టైగర్` ఏడు విభాగాలలో BAFTA లాంగ్ లిస్ట్ ‌లో చోటు దక్కించుకుంది. ఇందులో న‌టించిన ప్రముఖ నటుడు ఆదర్శ్ గౌరవ్ ఉత్తమ నటుడు కేట‌గిరీలో పోటీప‌డుతుండ‌గా.. ప్రియాంక చోప్రా ఉత్తమ సహాయ నటి కేట‌గిరీలో పోటీప‌డుతోంది.

బ్రిటిష్ అకాడమీ 2021 బాఫ్టా అవార్డుల జాబితాలో ది వైట్ టైగ‌ర్ ద‌ర్శ‌కుడు రామిన్ బహ్రానీ అవార్డుల కోసం పోటీప‌డుతున్నారు. ఉత్తమ చిత్రం కేట‌గిరీలో చివరి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇందులో న‌టించిన‌ ఆదర్ష్ గౌరవ్ ఉత్తమ నటుడి లాంగ్ ‌లిస్ట్ ‌లో చోటు దక్కించుకున్నారు. ఇందులో రిజ్ అహ్మద్ -సౌండ్ ఆఫ్ మెటల్.. మా రైనే - బ్లాక్ బాటమ్ .. దివంగత స్టార్ చాడ్విక్ బోస్మాన్ త‌దిత‌రులు పోటీప‌డుతున్నారు. ప్రముఖ నటులు టామ్ హాంక్స్ .. ఆంథోనీ హాప్కిన్స్ కూడా వరుసగా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ .. ది ఫాదర్ చిత్రాలతో లాంగ్ లిస్ట్ ‌లో చేరారు.

ఉత్తమ సహాయ నటి కేట‌గిరీలో ప్రియాంక చోప్రా జోనాస్ రంగంలో ఉన్నారు. ఈ జాబితాలో బోరాట్ తరువాతి మూవీ కాగా మరియా బకలోవా- ఎల్లెన్ బర్స్టిన్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్,.. గ్లెన్ క్లోజ్ ..హిల్ ‌బిల్లీ ఎలిజీ ...త‌రపున‌.. ది ఫాదర్ మూవీ న‌టి ఒలివియా కోల్మన్ తదితరులు జాబితాలో ఉన్నారు.

ఫారెన్‌హీట్ 451 .. 99 హోమ్స్ చిత్రాల‌తో బహ్రానీ పేరు తెచ్చుకోగా ఇప్పుడు ది వైట్ టైగ‌ర్ తో బాఫ్టాలో పోటీకి దిగారు. ఉత్తమ దర్శకుడు .. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాలలో ఆయ‌న‌ పోటీప‌డుతున్నారు. ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ .. ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లోనూ లాంగ్ లిస్ట్ లోకి వచ్చింది.

రాజ్ కుమార్ రావు- ప్రియాంక చోప్రా- గౌర‌వ్ కీల‌క పాత్ర‌లో నటించిన `ది వైట్ టైగర్` జనవరి 22 న నెట్ ఫ్లిక్స్ ‌లో విడుద‌ల కాగా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిన‌దే. బ‌ల‌రామ్ (గౌరవ్) అనే డ్రైవర్ అసాధారణ ప్రయాణాన్ని తెర‌పై ఆవిష్క‌రించింది. ఇందులో ఒక పేద గ్రామస్తుడి స్థాయి నుండి భారతదేశంలో విజయవంతమైన బిజినెస్ వ్యవస్థాపకుడిగా బల్రామ్ ఎదగడాన్ని చూపించిన తీరు ఆస‌క్తిక‌రం. అవ‌కాశాలు లేక‌పోయినా మ‌నిషి మ‌నుగ‌డ ఎలా సాగుతుందో చూపించిన చిత్ర‌మిది. రాజ్ కుమార్ రావును వివాహం చేసుకున్న యుఎస్ లో మొదటి తరం వలసదారు పింకీ మేడమ్ ‌గా ప్రియాంక‌ చోప్రా జోనాస్ నటించారు. ఎమ్మీ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత అవా డువెర్నేతో క‌లిసి పీసీ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా పనిచేశారు. ముకుల్ డియోరా సహకారంతో నెట్ ‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.