Begin typing your search above and press return to search.
ఈ భామల జీవితాల్లో.. 12 ఏళ్లు
By: Tupaki Desk | 25 May 2015 5:30 PM GMTసరిగ్గా 15 సంవత్సరాల క్రితం అందాల పోటీల్లో పోటీపడ్డారు ప్రియాంక చోప్రా, లారా దత్తా. ఇద్దరికీ కిరీటాలు వచ్చాయి. అయితే ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా ఎంపికైంది, లారా మిస్ యునివర్స్ అయ్యింది. ఆ ఇద్దరూ మరో మూడేళ్ల తర్వాత ముఖాలకు రంగేసుకుని, కథానాయికలు అయ్యారు. ప్రియాంక, లారా 12 సంవత్సరాల క్రితం అందాజ్ అనే చిత్రంతో నాయికలుగా ప్రమోట్ అయ్యారు.
తొలిసినిమానే పెద్ద హిట్. ఉత్తమ ఆరంగేట్ర కథానాయికలుగా ఫిలింఫేర్ అవార్డులు సైతం అందుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. అయితే ఇన్నేళ్లలో ఈ ఇద్దరి గ్రాఫ్ పరిశీలిస్తే అనూహ్యమైన డిఫరెన్స్ కనిపిస్తోంది. ఒకరి కెరీర్ జెట్‌స్పీడ్‌తో స్కైలో ఉంటే, మరొకరి కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. ప్రియాంక అమెరికన్ షో క్వాంటికోతో కోట్లాది రూపాయల డీల్ కుదుర్చుకుని బాలీవుడ్‌లోనే ఖరీదైన నాయికగా పేరు తెచ్చుకుంటే, లారాదత్తా మాత్రం కనీసం కథానాయికగా అవకాశాలైనా పట్టలేకపోతోంది. విశ్వసుందరి కేటగిరీలో ప్రియాంక ఆకాశాన్ని తాకి చూపించి లారాతో పాటు ఎందరికో ఆదర్శమైంది.