Begin typing your search above and press return to search.
పాప్ స్టార్ అయినా పెళ్లానికి గొడుగు పట్టాలి!
By: Tupaki Desk | 21 May 2019 5:41 AM GMTకేన్స్ 2019 ఉత్సవాల్లో అమెరికా కోడలు పీసీ హవా గురించి తెలిసిందే. హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి రెడ్ కార్పెట్ పై ఉర్రూతలూగించిన పీసీ రకరకాల డిజైనర్ డ్రెస్ లతో సోలో పెర్ఫామెన్సెస్ ని అదరగొట్టేసింది. ప్రియానిక్ అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఎండింగే లేకుండా సాగుతోంది ఇంకా. పది రోజుల కేన్స్ ఉత్సవాల్ని ఈ జంట క్లీన్ స్వీప్ చేసేయడం అభిమానుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది.
తాజాగా ఈ జోడీ వైట్ & వైట్ డిజైనర్ డ్రెస్ లో తళుక్కుమని మెరిశారు. మానస సరోవరం నుంచి దారి తప్పిన హంస రాణి కేన్స్ వేడుకల కోసం దిగొచ్చిందా? అన్నంతగా ఆ డిజైనర్ డ్రెస్ లో పీసీ ఒదిగిపోయి కనిపించింది. భార్యామణిని తథేకంగా చూస్తే రొమాంటిక్ యాంగిల్ లో నిక్ జోనాస్ అంతే లీనమైపోయాడు. పీసీకి కాంబినేషన్ గా తెల్లని సూట్ లో హబ్బీ ఆకట్టుకున్నాడు. పీసీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయాడు నిక్. ఇక వేరొక ఫోటోలో రెడ్ కార్పెట్ పై నడుస్తూ పీసీకి గొడుగు పట్టాడు ఈ అమెరికన్ పాప్ సింగర్ కం యాక్టర్.
సాక్షాత్తూ శ్రీమహా విష్ణువు అంతటి వాడే భార్య కాళ్లు పట్టాడని పురాణాలు చెబుతున్నాయి. మరి అమెరికన్ పాప్ సింగర్ అయినంత మాత్రాన నిక్ కి కన్సెషన్ ఏమైనా ఉంటుందా? పెళ్లాం ముందు గుంజీలు తీయాల్సిందే. ఎంతటి ఘనత వహించిన పాప్ స్టార్ అయినా ఇలా పెళ్లానికి గొడుగు పట్టాల్సిందే!! అంటూ యూత్ లో ఒకటే డిబేట్ రన్ అవుతోంది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ ని పీసీ మరీ ఇలా కొంగున చుట్టేసుకుందే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ సరదా పంచ్ లు. అప్పటికప్పుడు ఫన్ కోసం మాత్రమే. కేన్స్ ఈవెంట్ లో వైఫ్ అండ్ హజ్బెండ్ రొమాన్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తోంది.