Begin typing your search above and press return to search.
ప్రియానిక్.. ఏడాదైనా ఇంకా హనీమూన్ లోనే
By: Tupaki Desk | 30 Dec 2019 10:03 AM GMTమాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రాని ప్రేమించి పెళ్లాడాడు అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్. అలా భారతీయ నటి ప్రియాంక చోప్రా అమెరికా కోడలు అయ్యింది. విదేశీ కోడలు అయినా భర్త తో అన్యోన్య దాంపత్యం సాగిస్తుండడం చాలామందికి కన్ను కుట్టిందనే చెప్పాలి. ఒకరకంగా పీసీ సాధించిన ఈ ఘనతను అభిమానులు స్వగతించినా కోస్టార్స్ లో దీనిపై కుళ్లు బుద్ధితో చూసేవాళ్లు ఉన్నారు.
అంతెందుకు `భారత్` లాంటి భారీ చిత్రంలో ఆఫర్ ని తిరస్కరించినందుకు సల్మాన్ భాయ్ అంతటి వాడే పీసీ పై సెటైర్ వేశాడు. అమెరికా కోడలు ఇక ఇండియాలో నటించదులే! అంటూ ఓ సమావేశం లో పంచ్ వేశాడు. కేవలం తను మాత్రమే కాదు.. చాలా మంది ఈ తరహా పంచ్ లు వేసిన వాళ్లు ఉన్నారు. అయితే అలాంటివాళ్లందరికీ పీసీ సరైన సమాధానమే చెబుతోందిలా.
ఏడాది గడిచినా ఇంకా నిన్ననే పెళ్లయ్యిందా? అన్నంతగా భర్త నిక్ జోనాస్ కౌగిలిలో ఒదిగిపోయిన పీసీని చూస్తే కొత్త జంటలే కుళ్లుకోవాలి మరి. అంత ఘాడంగా హత్తుకుపోవడం ఈ జంటకే చెల్లింది మరి. నిక్ జోనాస్ తో ఎంతో రాయల్ గా సముద్రం పై బోట్ షికార్ చేస్తోంది. చిద్విలాసమైన తన జీవిత ఘట్టమిది. ఇలాంటి ఘట్టాలన్నిటినీ షేర్ చేయడం అభిమానుల కోసమే కాదు.. తనపై సెటైర్లు పేల్చిన వాళ్లకు సమాధానమే ఇది. అన్నట్టు ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ కాపురంలో చిచ్చు అంటూ కథనాలు ప్రచురించిన ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ తాము రాసినది తప్పుడు కథనం అని ఇప్పటికైనా ఒప్పుకుందో లేదో!!