Begin typing your search above and press return to search.
48కోట్ల విల్లాలో పీసీ కాపురం
By: Tupaki Desk | 27 Oct 2018 6:13 AM GMTఅమెరికన్ ప్రియుడు నిక్ జోనాస్ ని పెళ్లాడేందుకు పీసీ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 13 - 14 - 15 తేదీల్లో సంగీత్ - పెళ్లి వేడుకను ఘనంగా ప్లాన్ చేశారన్న వార్తలు వచ్చాయి. పెళ్లికి ఘనంగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఏంటి? ఎక్కడ కాపురం చేస్తారు? అంటే అందుకు ఆన్సర్ కూడా ప్రిపేర్ చేసి ఉంచాడు నిక్ జోనాస్. 26 ఏళ్ల ఈ అమెరికన్ సింగర్ చాలా అడ్వాన్స్ డ్ ప్లాన్ తోనే ఉన్నాడు. పెళ్లి తర్వాత ప్రణయానికి చాలా ముందే ఒకటి సిద్ధం చేశాడట.
తాను వలచిన ప్రేయసికి అదిరిపోయే గిఫ్ట్ ని ఇస్తున్నాడట. ఈ కానుకేంటో తెలిస్తే కళ్లు తిరిగి కింద పడతారు. ఆ కానుక ఖరీదు తెలిస్తే గుండెలదరి మతి భ్రమిస్తుంది ఎవరికైనా. సామాన్యుడు ఊహించని ఈ ఖరీదైన కానుక ఏంటో తెలుసా? సుమారు రూ.48కోట్ల (6.5 మిలియన్ డాలర్లు) పెట్టి అత్యంత ఖరీదైన జనాలు ఉండే లాస్ ఏంజెల్స్ బెవర్లీ హిల్స్ లో 5 బెడ్ రూమ్ విల్లా కొన్నాడు. దానిని పీసీకి కానుకగా ఇస్తున్నాడు.
ఈ విల్లాలో సకల సౌకర్యాలు ఉన్నాయిట. అంతకుమించి పీసీ బద్ధకంగా ఒళ్లు విరుచుకుని విండోలోంచి చూస్తే అల్లంత దూరాన అందమైన వ్యూ కనిపించేలా సెట్ చేశాడట. లాంజ్ లు - స్విమ్మింగ్ పూల్స్ వగైరా వగైరా అబ్బో! ఆహా అనాల్సిందేనట!! ఇంతకీ ఎన్ని చదరపు గజాల్లో ఉంది ఈ ఇల్లు అంటే .. 4,129 చ.గజాల స్థలంలో వన్నెచిన్నెల వయ్యారిలా ఉంటుందిట ఈ విల్లా. ఒంటరిగా తుంటరిగా రాసలీలలేల! అంటూ సాంగేసుకోవడానికి ఇందులో ఎంతో ప్రైవసీ కూడా ఉండేలా నిక్ ప్లాన్ చేశాడని మహా రసికరాజానే అని చెబుతున్నారు. అన్నట్టు వందల కోట్లు అప్పులు చేశాడని .. ఆ అప్పులు తీర్చేందుకు పీసీని తెలివిగా ఇరికించాడని ప్రచారం చేసినవాళ్లందరికీ అతడు ఇలా షాకిస్తున్నాడేంటబ్బా?