Begin typing your search above and press return to search.

ద్రౌప‌దిలా కిసుక్కున న‌వ్వింది!

By:  Tupaki Desk   |   22 Sep 2018 5:48 AM GMT
ద్రౌప‌దిలా కిసుక్కున న‌వ్వింది!
X
హ‌బ్బీ నిక్ జోనాస్‌ తో దేశ‌విదేశాల్లో షికార్లు చేస్తోంది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. పెళ్లికి ముందే ప్రీ పెళ్లి పూర్తి చేసుకుని అధికారికంగా ల‌డాయి మొద‌లు పెట్టేసింది. దీంతో ముంబై మీడియాకి అన‌వ‌స‌ర గాసిప్పుల‌కు ఛాన్స్ లేకుండా పోయింది. పీసీ ఏం చేసినా మేధోత‌నంతో చేసిన ప‌ని ఇది.

ఇక‌పోతే లండ‌న్ ప్రియుడు నిక్‌ కోణంలోనూ ఇదివ‌ర‌కూ బోలెడంత చ‌ర్చ సాగింది. త‌న‌కు ఉన్న అప్పుల తిప్ప‌లు వ‌దిలించుకోవాలంటే పీసీ సంపాద‌న‌పై క‌న్నేయ‌డ‌మే క‌రెక్ట‌ని నిక్ భావించాడ‌ని మీడియా ర‌చ్చ ర‌చ్చ చేసింది. అదంతా స‌రే.. దీనిపై పీసీ- నిక్ కూడా బోలెడ‌న్ని జోకులు పేల్చేస్తున్నారు.

పోనీలే అనుకుంటే.. ఇదిగో నిక్‌ తో పీసీ స‌ర‌స‌స‌ల్లాపాలు - సంబ‌రాలు చూస్తుంటే క‌న్ను కుట్ట‌కుండా ఉండ‌దు. విదేశీ వినువీధుల్లో పీసీ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. క్ల‌బ్బు - ప‌బ్బు - బ‌ర్త్ డే పార్టీలు - ఈవెంట్లు అంటూ ఒక‌టేమిటి జీవితాన్ని పిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. అలా ఓ లేక్ ఒడ్డున ఇదిగో ఇలా కిసుక్కున న‌వ్వేసింది. మాయామ‌హ‌ల్‌ లో దుర్యోధ‌నుడిని చూసి ద్రౌప‌ది న‌వ్విన‌ట్టు ఆ న‌వ్వేంటి పీసీ? అని ప్ర‌శ్నిస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం పీసీ న‌వ్వింది. ఆ వీడియోని హ‌బ్బీ నిక్ ట‌పీమ‌ని క్యాచ్ చేసి కెమెరాలో బంధించేశాడు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో పీసీ ద్రౌప‌ది న‌వ్వు తెగ పాపుల‌రైపోతోంది. హ‌బ్బీ నిక్‌ తో దిగిన ఫోటోలు కూడా. ఒక ఫోటోలో డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌న‌మిచ్చాడు పాన‌కంలో పుడ‌క‌లాగా! అలానే ఈ ఫోటోలు - వీడియోల్లో క‌నిపించిన‌ పీసీ డిజైన‌ర్ శారీ గురించి డిస్క‌ష‌న్ సాగుతోంది. పాక్షికంగా అందాల్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది ఆ శారీ.