Begin typing your search above and press return to search.

ఉన్నది అమ్ముకుని కొత్త గూడు వెతకాలా!

By:  Tupaki Desk   |   7 Aug 2019 9:11 AM GMT
ఉన్నది అమ్ముకుని కొత్త గూడు వెతకాలా!
X
ఉన్న ఇల్లు అమ్ముకుని కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే అంత ఈజీనా? అందునా విలాసాల స్వ‌ర్గం న్యూయార్క్(అమెరికా) లాంటి ఖ‌రీదైన న‌గ‌రంలో ఇంకా క‌ష్టం. అయినా త‌ప్ప‌దు. ఉన్న గూడు అమ్మారు. ఇప్పుడు కొత్త గూడు కోసం జంట‌గా వెతుక్కుంటున్నారు. గూడు క‌నిపెట్ట‌డ‌మే పెండింగ్. ఇంత‌కీ వెతుకుతున్న ఈ జంట ఎవ‌రు? అంటే ఇంకెవ‌రు.. ప్రియానిక్ జోడీ.

విలాస‌పురుషుడు అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్ బ్యాచిల‌ర్ గా ఉన్న‌ప్పుడు విలాస‌వంత‌మైన `బ్యాచిల‌ర్ ప్యాడ్` అనే ఔట్ డోర్ లైఫ్ స్టైల్ విల్లాలో నివ‌శించాడు. అది అత‌డి డ్రీమ్ హౌస్. దాదాపు 46 కోట్లు (6.9 మిలియ‌న్ డాల‌ర్లు) వెచ్చించి ఎంతో మ‌న‌సుప‌డి మ‌రీ కొనుక్కున్నాడు. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం ఆ ఇల్లు అమ్మాల్సి వ‌చ్చిందని ఇదివ‌ర‌కూ మీడియాలో ప‌లు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. 6.9 మిలియ‌న్ డాల‌ర్ల విలువ చేసే ఆ ఇంటి కోసం నిక్ 6.5 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాడు. మిగ‌తా బ్యాలెన్స్ చెల్లించేందుకు కానీ.. ఇంటికి అద‌నంగా పెట్టుబ‌డి పెట్టేందుకు చేతిలో చిల్లి గ‌వ్వ అయినా లేకుండా పోయింద‌ట‌. దీంతో తిరిగి ఆ బ్యాచిల‌ర్ ప్యాడ్ ఇంటిని ఇష్టం లేక‌పోయినా అమ్మేయాల్సొచ్చింది. అలా అమ్మాక భార్య ప్రియాంక చోప్రాతో క‌లిసి ప్ర‌స్తుతం మ‌రో కొత్త ఇంటి కోసం వెతుకుతున్నాడ‌ట‌. ఆ ఇల్లు ఎక్క‌డ దొరుకుతుంది? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

ఈసారి బ్యాచిల‌ర్ ప్యాడ్ అంత ఖరీదైన ఔట్ డోర్ ఫెసిలిటీతో స్విమ్మింగ్ పూల్ ఉన్న స్పెష‌ల్ హౌస్‌ దొర‌క్క‌పోయ‌నా మీడియం బ‌డ్జెట్లో దొరికిన దానితోనే స‌రిపుచ్చుకోవాల్సి ఉంటుంది. గ‌త ఏడాది ఏప్రిల్ లో ఇల్లు అమ్మారు. ఇప్ప‌టికి పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది ఈ కొత్త జంట‌కు. ఓ వైపు ఇంటి కోసం వెతికినా మ‌రోవైపు పీసీకి బాలీవుడ్ లో కొన్ని ఇంపార్టెంట్ అసైన్ మెంట్స్ ఉన్నాయి. పీసీ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. `ది స్కై ఈజ్ పింక్` అక్టోబ‌ర్ లో రిలీజ్ కి వ‌స్తోంది. ఈ చిత్రంలో ఫ‌ర్హాన్ అక్త‌ర్ - జైరా వాసిమ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దీంతో పాటే ప‌లు బాలీవుడ్ సినిమాల‌కు క‌మిటైంద‌ని వార్త‌లొచ్చాయి. వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు వాటి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి.