Begin typing your search above and press return to search.

ప్రియాంక - నిక్‌ ల పెళ్లి జరిగిందిలా..!

By:  Tupaki Desk   |   3 Dec 2018 7:27 AM GMT
ప్రియాంక - నిక్‌ ల పెళ్లి జరిగిందిలా..!
X
గత కొన్ని నెలలుగా ఊరిస్తూ వచ్చిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా మరియు అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ ల వివాహం నిన్న వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ లోని ఛారిత్రాత్మకమైన ఉమైద్‌ భవనంలో ఈ వివాహ వేడుక జరిగింది. హిందూ, క్రిస్టియన్‌ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరు అయ్యారు. బాలీవుడ్‌ స్టార్స్‌ వివాహం వేడుక అంటే అంతా కూడా సంగీత్‌ పై ఆసక్తి కనబర్చుతూ ఉంటారు. సంగీత్‌ ఎలా సాగిందా అని అంతా చర్చించుకుంటూ ఉంటారు.

ప్రియాంక, నిక్‌ ల పెళ్లికి ముందు సంగీత్‌ కార్యక్రమం అదరహో అన్నట్లుగా సాగింది. ఒక పెద్ద అవార్డు వేడుక లేదా సినీ వేడుక జరిగినట్లుగా డాన్స్‌ లు, పాటలు అన్నట్లుగా సాగింది. వదువు, వరుడితో పాటు వచ్చిన బందువులు ఎంతో మంది డాన్స్‌ లు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రియాంక మరియు నిక్‌ లు కలిసి డాన్స్‌ చేయడంతో పాటు విడి విడిగా డాన్స్‌ లు చేస్తూ సందడి చేశారు. పలు హిందీ సాంగ్స్‌ కు నిక్‌ డాన్స్‌ లు వేయగా, ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ మరియు నీతా అంబానీలు తెగ ఎంజాయ్‌ చేశారు.

ఇక ప్రియాంక చోప్రా మరియు ఆమె తల్లి మధు చోప్రాలు కలిసి ఒక పాటకు డాన్స్‌ చేసిన సమయంలో ఆడిటోరియంలో ఉన్న వారు అంతా కూడా కేకలు వేశారు. ప్రియాంక పలు పాటలకు అద్బుతమైన డాన్స్‌ లు చేయడంతో పాటు, నిక్‌ పాడిన కొన్ని పాటలకు కూడా స్టెప్పులు వేసి అలరించింది. బాలీవుడ్‌ ప్రముఖులు హాజరు అయిన ఈ వివాహం అద్బుతంగా జరిగినట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి తంతు ముగియడంతో త్వరలో ముంబయిలో భారీ ఎత్తున రిసెప్షన్‌ ఏర్పాటు చేయబోతున్నారు.