Begin typing your search above and press return to search.

హ‌బ్బీతో అంత్యాక్ష‌రి ఆడుతోందే!

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:45 AM GMT
హ‌బ్బీతో అంత్యాక్ష‌రి ఆడుతోందే!
X
పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా విదేశీ బోయ్‌ ఫ్రెండ్ నిక్ జోనాస్‌ ని పెళ్లాడేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్‌ లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. మొన్న‌టికి మొన్న రోకా (నిశ్చితార్థం) పేరుతో ముంబైలోని ఓ ఖ‌రీదైన హోట‌ల్లో బోలెడంత హంగామా చేశారు నిక్యాంక‌ (ప్రియాంక‌- నిక్‌) జోడీ. నిక్ జోనాస్ త‌న త‌ల్లిదండ్రులు - బంధుమిత్రుల‌తో క‌లిసి ఈ వేడుక‌లో పాల్గొన్నాడు. స‌కుటుంబ స‌ప‌రివారస‌మేతంగా విచ్చేసి పీసీకి అంగుళీకం తొడిగేశాడు. ఇంత‌కుముందే బ్రిట‌న్‌ లో నిశ్చితార్థం పూర్త‌యినా.. ఇప్పుడు ఇండియ‌న్ ట్రెడిష‌న్‌ లో రోకా పార్టీ పూర్తి చేశారు.

ఆ క్ర‌మంలోనే నిక్ జోనాస్ బంధువుల‌కు పీసీ త‌మ పూర్వీకుల ఇంటిని చూపించింది. నాలుగురోజుల ట్రిప్‌ లో నిక్ & టీమ్ ఇండియ‌న్ సెల‌బ్రేష‌న్స్ అద‌ర‌గొట్టేశారు. పీసీ- నిక్ జోనాస్ జంట కుటుంబ స‌భ్యులతో క‌లిసి అంత్యాక్ష‌రి కార్య‌క్ర‌మాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇందులో నిక్ జోనాస్ అద్భుతంగా పాడాడు. పీసీ ఆ ప‌క్క‌నే కొలువుదీరి హ‌బ్బీని క్లాప్స్‌ తో ఎంక‌రేజ్ చేసింది.

రోకా ముగిసింది. ఇక తిరిగి `ది స్కై ఈజ్ పింక్‌` షూటింగ్ కోసం సెట్స్‌ లో జాయిన్ అయ్యింది పీసీ. ఆన్ సెట్స్ టీమ్ అంతే పెద్ద స‌ర్‌ ప్రైజ్ ఇచ్చింది. బెలూన్స్‌ తో ఓ రింగ్‌ ని త‌యారు చేసి పీసీకి వెల్‌ కం చెప్పింది టీమ్‌. `ఓహ్ ద‌ట్ రింగ్‌` అంటూ పీసీ త‌న‌దైన శైలిలో ఆనందం వ్య‌క్తం చేసింది. ఆ ఫోటోని ట్విట్ట‌ర్‌ లో అభిమానుల కోసం షేర్ చేసింది. అంబానీల కేక్ కార్య‌క్ర‌మం రేంజులో పీసీ- నిక్ సెల‌బ్రేష‌న్స్ సాగాయంటే న‌మ్మండి.


వీడియో కోసం క్లిక్ చేయండి