Begin typing your search above and press return to search.
వారిది పూర్తి.. వీరిది మొదలు
By: Tupaki Desk | 21 Nov 2018 4:31 PM GMTబాలీవుడ్ స్టార్ లవ్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునే ఇటీవలే ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వారి వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు అంతా కూడా దీపవీర్ ల వివాహం గురించి కథనాలు ప్రసారం చేయడం జరిగింది. పెళ్లి పూర్తి అయ్యింది, బెంగళూరులో వివాహ రిసెప్షన్ కూడా జరిగింది. వారి పెళ్లి హడావుడి దాదాపుగా పూర్తి అయినట్లే. ఈ సమయంలోనే మరో స్టార్ కపుల్ పెళ్లి సందడి మొదలు అయ్యింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరియు హాలీవుడ్ నటుడు నిక్ జొనాస్ ల వివాహం డిసెంబర్ లో జరుగబోతుంది. వీరి వివాహంకు జోద్ పూర్ లోని ఉమైద్ భవన్ సిద్దం అయ్యింది. ఈ పురాతన కట్టడంను అందంగా అలంకరిస్తూ పెళ్లికి సిద్దం చేస్తున్నారు. వీరి వివాహం కూడా రెండు సాంప్రదాయాల ప్రకారం జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరి వివాహ ఏర్పాట్ల గురించి బాలీవుడ్ లో ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. కోటలో పెళ్లి అత్యంత అద్బుతంగా జరుగబోతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
డిసెంబర్ 2వ తారీకున ఇండియన్ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరుగనుండగా, ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ 3వ తారీకున క్రిస్టియన్ ట్రెడీషన్ లో పెళ్లి జరుగనున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దీపవీర్ ల వివాహం గురించి కవరేజ్ చేసిన మీడియా ఇప్పుడు ప్రియానిక్ ల పెళ్లి వార్తలను షురూ చేశారు.