Begin typing your search above and press return to search.
మంచి కోసం ముద్దుగుమ్మల అందాలు
By: Tupaki Desk | 12 Nov 2017 4:03 AM GMTప్రపంచం మొత్తం మెచ్చే అందాల భామ అనిపించుకోవడం చాలా కష్టమైన విషయం. ఇది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. అయితే.. ఈ మధ్య బ్యూటీలు తమ అందాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. సామాజిక స్పృహ కూడా పెంచేసుకుంటున్నారు.
రీసెంట్ గా క్యాన్సర్ పై అవగాహనను పెంచే ఓ కార్యక్రమంలో ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారెవరో కాదు.. మన దేశం నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా ఒకరు అయితే.. ప్రపంచం మెచ్చిన మరో బ్యూటీ సోఫియా వెర్గరా. ఈ ఇద్దరూ కలిసి బెవర్లీ హిల్స్ లో జరిగిన స్టాప్ క్యాన్సర్ ఈవెంట్ లో సందడి చేశారు. సామాజిక సేవ కోసమే అయినా అట్రాక్షన్ ఉండాలంటే.. అందాలు పండించాలి కదా.. అందుకే ఈ ఇద్దరు భామలు స్పెషల్ గా ప్రిపేర్ అయిపోయారు. 45 ఏళ్ల సోఫియా.. 35 ఏళ్ల ప్రియాంక.. వీరి అందాలతో ఆడిటోరియం అదిరిపోయిందని చెప్పాలి.
ఫ్లవర్ డిజైన్ తో స్ట్రాప్ లెస్ డ్రెస్ లో సోఫియా సందడి చేస్తే.. యెల్లో కలర్ చెక్స్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. డిజైనర్ డ్రెస్సుల్లో ఈ ఇద్దరూ మెరిపించిన మెరుపులు.. స్టాప్ క్యాన్సర్ ఈవెంట్ కు మరింతగా ఫేమ్ తెచ్చేశాయి.. బోలెడంత ప్రచారాన్ని అందించాయి.