Begin typing your search above and press return to search.
మహిళా శక్తిని సానబెడుతున్న ప్రియాంక
By: Tupaki Desk | 10 Feb 2017 5:49 AM GMTబాలీవుడ్ కం హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు యాక్టింగ్ మాత్రమే కాకుండా.. మరో విభాగంలోకి అడుగు పెట్టేసింది. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసి.. వరుసగా సినిమాలను నిర్మించేస్తోంది. ఇప్పటికే మరాఠీ.. పంజాబి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ప్రియాంక.. ఇప్పుడు ఒకేసారి మూడు భాషల్లో సినిమాలు తీసేస్తోంది.
ఈ మూడు సినిమాలకు దర్శకులు మహిళలే కావడం ఒక స్పెషాలిటీ అయితే.. అన్ని చిల్డ్రన్స్ ఫిలిమ్స్ కావడం మరో విశేషం. 'నేను ఇప్పుడు ఉన్న సిట్యుయేనష్ లో సినిమా రంగానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నా. మన దేశంలో విభిన్న సంస్కృతుల కారణంగా ఎన్నెన్నో కధలు ఉంటాయి. నేను ఇప్పుడు నిర్మిస్తున్న ప్రతీ చిత్రం.. చిన్నారుల హృదయాలను తాకేలా ఉంటుంది' అని చెబుతోంది ప్రియాంక చోప్రా. సిక్కిమీస్ భాషలోను.. కొంకణి.. హిందీ భాషల్లో పిల్లల సినిమాలు తీస్తోంది పీసీ.
సిక్కిం భాషలో పాఖీ టైర్ వాలా దర్శకత్వంలో 'పహునా' అనే చిత్రం తీస్తోంది ప్రియాంక. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన ముగ్గురు పిల్లల స్టోరీ ఇది. కొంకణి-హిందీ భాషల్లో సువ్రతా నస్నోద్కర్ దర్శకత్వంలో 'లిటిల్ జో.. కహా హో?' అనే సినిమా నిర్మాణం జరుగుతోంది. పూర్తిగా గోవాలో తీస్తున్న ఈ మూవీ.. లెజెండరీ కార్టూనిస్టులు అయిన ఆర్కే లక్ష్మణ్, మారియో మిరందాలకు నివాళి అని చెప్పింది పీసీ. హిందీలో లారా మిశ్రా దర్శకత్వంలో 'అల్మసీర్' అనే మూవీని తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్ తో తీస్తున్నామని.. ఓ కుర్రాడికి ఓ కుక్కకు మధ్య ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పింది ప్రియాంక.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/