Begin typing your search above and press return to search.
తెల్ల కుర్రాడితో ఎర్ర మందారం
By: Tupaki Desk | 29 Jun 2018 5:13 AM GMTఇన్నాళ్లుగా రూమర్ గా ఉన్నది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందని.. రేపో మాపో అతడిని పెళ్లి చేసుకోబోతోందనే టాక్ కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఈమధ్యనే ఈ జంట కలిసి ఇండియాకి వచ్చింది. ముంబయిలో రెండురోజులుండి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది.
తాజాగా నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రా జంట ముంబయిలో మెరిసింది. ఈసారి మామూలుగా కాదు.. చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ మరీ కనిపించారు. ఇండియాలోని టాప్ మోస్ట్ ఇంటస్ట్రియలిస్ట్ అయిన ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ ఎంగేజ్ మెంట్ జూన్ 30న జరగనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్లందరికీ ముఖేష్ అంబానీ పెద్ద పార్టీ ఇచ్చాడు. దీనికే ప్రియాంక - నిక్ జోనాస్ జంటగా వచ్చి కపుల్ ఎంట్రీలోంచి పార్టీకి కలిసి వెళ్లారు. నిక్ మామూలుగా సూట్ లో వస్తే ప్రియాంక ఎర్రటి శారీ - గోల్డ్ కలర్ బ్లవుజ్ తో మెరుపులు మెరిపించింది.
బాలీవుడ్ బోలెడు పాపులారిటీ సంపాదించేసిన ప్రియాంక చోప్రా బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. దీంతో పాటు క్వాంటికో టీవీ సిరీస్ లోనూ నటించింది. ఇందుకోసం చాలారోజుల పాటు అమెరికాలోనే ఉంది. ఈ టైంలోనే ఈ అందాల భామకు నిక్ జోనాస్ పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. మొత్తానికి ప్రియాంక తన మనసులోని మాటేంటో నోరువిప్పి చెప్పకుండానే చెప్పేసింది.