Begin typing your search above and press return to search.

సెక్సీ యాంగిల్ చాలానే దాగుంది

By:  Tupaki Desk   |   10 Sep 2016 4:26 AM GMT
సెక్సీ యాంగిల్ చాలానే దాగుంది
X
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో దాదాపుగా సెటిల్ అయిపోయింది. ఒకవైపు బాలీవుడ్ సీరియల్ క్వాంటికో.. మరోవైపు బేవాచ్ మూవీలను చేసేస్తున్న ఈ బ్యూటీ.. చీటికీ మాటికీ బాలీవుడ్ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజ్ ల పైకి ఎక్కేస్తోంది. ఇండియాకి అప్పుడప్పుడు వస్తూ.. చకచకా పనులు కానిచ్చేసి యూఎస్ చెక్కేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇప్పుడు జరుగుతున్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది.

ఈ ఫ్యాషన్ వీక్ కి.. ఫ్యాషన్ డిజైనర్ థకూన్ డిజైన్ చేసిన ప్రింటెడ్ డ్రస్ లో సింపుల్ గా హాజరైంది ప్రియాంక. ఈ డ్రెస్ సింపుల్ అనిపించేట్లుగా ఉంది కానీ.. అంతకు మించిన సెక్సీ యాంగిల్ చాలానే దాగుంది. హాలీవుడ్ వెళ్లాక క్లీవేజ్ అందాలను పరచడంలో ఆరితేరిపోయిన ఈ సుందరి.. టైట్ డ్రస్ లో మరింతగా రెచ్చిపోయింది. ఏ యాంగిల్ నుంచి ఫోటో ఎలా ఉంటుందో.. ఏ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తుందో ముందే పసిగట్టగల నేర్పు సంపాదించేసిన పీసీ.. అందుకు తగ్గట్లుగానే పోజులు ఇచ్చేసింది.

ఈ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై పీసీ కనపడలేదు గానీ.. అమ్మడి రేంజ్ ఎప్పుడో ఆ లెవెల్ ని దాటేసింది. అయితే.. ఇంత గ్లామర్ కురిసే ఈవెంట్ లో ఆమాత్రం సోయగాలు ప్రదర్శించకపోతే డల్ అయిపోతామని.. ఫోకస్ మిస్ అవుతుందని ప్రియాంకకు తెలీదా ఏంటి!