Begin typing your search above and press return to search.
బ్రహ్మచారిణి పార్టీలో ప్రియాంక హంగామా
By: Tupaki Desk | 5 Nov 2018 7:54 AM GMTబాలీవుడ్ లో హీరొయిన్ల పెళ్లి సందడి మొదలైపోయింది. ఒకపక్క దీపికా పదుకునే హంగామా షురూ కాగా మరోపక్క ప్రియాంకా చోప్రా సైతం ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. నిక్ జోనాస్ తో నిశ్చితార్థం ఇది వరకే చేసేసుకున్న ప్రియాంకా ఇంకా పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు రివీల్ చేయటం లేదు. రన్వీర్ సింగ్ దీపికా పదుకునే పెళ్లి తేదీతో క్లాష్ అయ్యే అవకాశం ఉందని కూడా టాక్ ఉంది. ఎలాగూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది. స్వస్తి చెప్పబోతున్న ఒంటరితనానికి గుర్తుగా చేసుకునే బ్యాచిలర్ పార్టీ ప్రియాంకా అమెరికాలో తన స్నేహితులకు ఇచ్చేసింది.
ఇప్పుడు ఆ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. బ్రైడల్ షవర్ పార్టీ పేరుతో న్యూ యార్క్ అమ్స్టర్ డ్యామ్ లో జరిగిన ఈ పార్టీకి థైస్ కనిపించేలా ఉండే హాఫ్ షోల్డర్ స్వేట్టర్ లాంటి హాఫ్ గౌన్ కాస్ట్యూమ్ తో ప్రియాంకా లుక్స్ తోనే అందరిని పడగొట్టేసింది. వయసు 35 దాటింది అంటే ఎవరైనా నమ్మడం కష్టమనేలా మరిపించింది.ప్రియాంకా అమెరికా ఫ్రెండ్స్ తో పాటు తమన్నా దత్-నటాషా పాల్-చంచల్ డిసౌజా-డనా సప్నిక్-సోఫీ టర్నర్-శ్రీష్టి బెహెల్ ఆర్యలతో పాటు ఇతర స్నేహితులు పాల్గొన్నారు. షాంపైన్ కూడా ఏరులై పారిందట.
పెళ్లి తరువాత అక్కడే సెటిల్ అయ్యేందుకు వీలుగా లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఖరీదైన బంగాళాను కూడా కొనేశారు. మన కరెన్సీలో దీని ఖరీదు 50 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. జోధ్ పూర్ లో జరిగే పెళ్లి గురించి మాత్రం కుటుంబ సభ్యులతో సహా అందరూ గుట్టుగా ఉంచుతున్నారు. మొత్తానికి తనదైన శైలిలో రచ్చ చేస్తున్న ప్రియాంకా పెళ్లి ఘడియల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.