Begin typing your search above and press return to search.

మిస్ వరల్డ్ టు హాలీవుడ్ - పద్మశ్రీ జర్నీ

By:  Tupaki Desk   |   26 Jan 2016 5:30 AM GMT
మిస్ వరల్డ్ టు హాలీవుడ్ - పద్మశ్రీ జర్నీ
X
మిలీనియం ఏడాది అయిన 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడంతోనే, ప్రపంచాన్ని ఆకర్షించింది ప్రియాకం చోప్రా. అలాగని ఉప్పొంగి పోకుండా.. 'నేను సాధించాల్సింది చాలా ఉంది' అని ఆ రోజు చెప్పడంతోనే.. ఇవాళ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరుకుంది ఈ ప్రతిభా సుందరి.

ఇప్పుడు బాలీవుడ్ లో అత్యంత ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ప్రియాంక. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె జర్నీ ఏమీ సాఫీగా సాగలేదు. మొదట ఈమె కోలీవుడ్ మూవీ తమిళన్ తో సినీ రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత ది హీరోతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్లాన్ - కిస్మత్ - అసంభవ్ లు వరుసగా ఫ్లాప్ అయినా ఎంతో నిబ్బరంతో కొనసాగింది. ఆ తర్వాత ముఝ్ సే షాదీ కరోగీ - ఐత్ రాజ్ - బ్లఫ్ మాస్టర్ వంటి మూవీస్ తో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మళ్లీ ఫ్లాపుల బాట పట్టినా. ఫ్యాషన్ తో ప్రియాంక కెరీర్ టాప్ రేంజ్ కి వెళ్లిపోయింది. జాతీయ ఉత్తమ నటిగానూ అవార్డు అందుకుంది.

ఒకే సినిమాలో 12 పాత్రలు చేసిన వాట్స్ యువర్ రాశి.. ఈమె కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం. మేరీ కోమ్ లో బాక్సింగ్ ప్లేయర్ గా అందరినీ మెప్పించింది. రీసెంట్ గా వచ్చిన బాజీరావు మస్తానీలో కాశీబాయిగా ప్రియాంక పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్వాంటికో సీరియల్ తో హాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ఈమెకు.. తాజాగా పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ కూడా అందుకుంది. ఇప్పుడు దక్కిన పద్మశ్రీ.. ఆమెకు దక్కిన గౌరవాల్లో అన్నింటికన్న మిన్న.