Begin typing your search above and press return to search.
ప్రియాంక సినిమాకు సింగిల్ రేటింగ్ ఇచ్చారు
By: Tupaki Desk | 27 May 2017 7:53 AM GMT‘క్వాంటికో’ టీవీ సిరీస్ ఇచ్చిన ఊపుతో హాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిపోవచ్చని అనుకుంది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. ఈ సిరీస్ తర్వాత ఆమెకు ఓ భారీ హాలీవుడ్ ప్రాజెక్టులో చోటు దక్కింది. ఆ సినిమానే బేవాచ్. 90ల్లో అమెరికన్ టీవీ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపిన టీవీ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మరికొందరు హాలీవుడ్ ప్రముఖ తారలు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంక ఇందులో విలన్ పాత్ర చేయడం విశేషం. టీజర్.. ట్రైలర్లలో క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టిన ప్రియాంక.. సినిమాలో ఇంకెంతగా రెచ్చిపోతుందో అని ఎదురు చూశారు కుర్రాళ్లు.
ప్రియాంక అందాల మాట పక్కన పెడితే.. ఈ శుక్రవారమే విడులైన ‘బేవాచ్’ను ఇంటర్నేషనల్ క్రిటిక్స్ చెత్త సినిమా అని తేల్చేశారు. వాషింగ్టన్ పోస్ట్ క్రిటిక్ ఈ సినిమాను చీల్చి చెండాడేసి.. సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇంకా అమెరికన్ ప్రముఖ పత్రికలన్నీ కూడా ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. ఇంటర్నేషనల్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమాపై పెదవి విరిచారు. కంటెంట్ లేని ఈ సినిమాలో అదనపు ఆకర్షణలు మాత్రమే ఉన్నాయని.. ఇదొక సాదాసీదా అడల్ట్ కామెడీ లాగా ఉందని వాళ్లు తీర్మానించారు. ప్రియాంక గురించి చెప్పుకోవడానికేమీ లేదని.. ఆమె కళ్లు.. క్లీవేజ్ అందాల మీదే కెమెరాల కళ్లు నిలిచాయని.. డ్వేన్ జాన్సన్ సినిమాల్లో హీరోయిన్ల నటన గురించి మాట్లాడుకోవడానికి అసలు ఏమీ ఉండదని వాషింగ్టన్ పోస్ట్ రివ్యూలో పేర్కొంది. మొత్తానికి హలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్టులో నటించానన్న ఆనందం తప్ప.. ఈ సినిమా వల్ల ప్రియాంకకు ఒరిగిందేమీ లేదంటున్నారు. ‘బేవాచ్’ ఇండియాలో జూన్ 2న విడుదల కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/