Begin typing your search above and press return to search.
నిక్ బి-డే పీసీ ఏం చేసిందంటే?
By: Tupaki Desk | 17 Sep 2018 5:51 AM GMTపీసీ అలియాస్ ప్రియాంక చోప్రా .. గంగవెర్రులెత్తిస్తున్న బాలీవుడ్ సోగ్గత్తె. బోయ్స్ ని హీటెక్కిస్తున్న ఏకైక హాట్ సెలబ్రిటీ పీసీ. వైరస్ లా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది ఈ అమ్మడి క్రేజు. బ్రిటీష్ నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడుతోంది అన్న వార్తతో ఒక్కసారిగా తన పాపులారిటీ స్కైని టచ్ చేసింది. పీసీ బ్రాండ్ వ్యాల్యూ పదింతలు అయ్యింది. క్వాంటికో సిరీస్ ని క్లోజ్ చేస్తే ఏంటి? తనకి హాలీవుడ్ కెరీర్ పరంగా ఏ డోఖా లేకుండా ప్లాన్ చేస్కుంది పీసీ.
అతడి ప్రేమలో నిండా మునిగింది. నిక్‌కి ఉన్న అప్పులన్నీ తానే చెల్లించేంతగా ప్రేమిస్తోంది. ఈ పరిణామం నిక్ కి కూడా కొత్తగానే అనిపించక మానదు. ఏదైతేనేం.. ఈ జంట ప్రణయం మూడు పువ్వులు ముప్పయ్ కాయలు అన్న చందంగా వెలిగిపోతోంది. లేటెస్టుగా నిక్ జోనాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పీసీ ఓ రేంజులో హడావుడి చేసింది. ఈ వేడుకల కోసం ప్రత్యేకించి ఓ రాక్ బ్యాండ్ దిగిపోయింది. అందరి సమక్షంలో నిక్ బర్త్ డే కేక్ కట్ చేసి పీసీకి కేక్ తినిపించాడు. పీసీ తనకు తినిపిస్తే అంతే ఇష్టంగా తిన్నాడు.
వీటన్నిటినీ మించి ఈవెంట్ ఆద్యంతం నిక్ ఫ్యాన్స్ గోల గగ్గోలు పెట్టేశారు. అందులో లేడీ ఫ్యాన్స్ అతడు ఓ ఛాన్సిస్తే మీద పడి ఏదో చేసేట్టే కనిపించింది వ్యవహారం. మొత్తం మీద దొండపండు లాంటి కుర్రాడితో ప్రేమసరాగాల్ని పీసీ ఓ రేంజులో సెలబ్రేట్ చేస్తోంది. అన్నట్టు రోకా (నిశ్చితార్థం) వేడుక పూర్తయింది. పెళ్లి తేదీ ఎప్పుడో ఇంకా చెప్పనేలేదు. ఈ అక్టోబర్ లేదా నవంబర్ లో వివాహం ఉంటుందని ప్రచారమైంది. దీనిపై అధికారికంగా పీసీ ఏదైనా చెబుతుందేమో చూడాలి.