Begin typing your search above and press return to search.

రూల్స్‌ బ్రేక్‌ చేసి ఫుల్‌ ఎంజాయ్‌!

By:  Tupaki Desk   |   30 Oct 2018 6:44 AM GMT
రూల్స్‌ బ్రేక్‌ చేసి ఫుల్‌ ఎంజాయ్‌!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా డిసెంబర్‌ లో ప్రియుడు నిక్‌ జోనస్‌ ను వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. పెళ్లికి నెల రోజుల సమయం ఉండగానే హంగామా ప్రారంభం అయ్యింది. తాజాగా ప్రియాంక చోప్రాను అమెరికాలో పెళ్లి కూతురును చేశారు. ఈవేడుక చాలా వైభంగా జరిగింది. ప్రియాంక చోప్రా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇంకా నిక్‌ కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ప్రియాంక చోప్రా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

ాప్రేమ, ఆనందం తో మది నిండి పోయిన సందర్బంలో అద్బుతమైన వ్యక్తులతో కలిసి వేడుక చేసుకున్నాం. పెళ్లి కూతురు రూల్స్‌ అన్నీ కూడా బ్రేక్‌ చేసి మరీ ఫుల్‌ గా ఎంజాయ్‌ చేశాం. ఇలాంటి వేడుకతో నన్ను సర్‌ ప్రైజ్‌ చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు. ఇంత అద్బుతమైన పార్టీ ఉంటుందని భావించలేదు. రూల్స్‌ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఎంజాయ్‌ చేసిన తీరు ఎప్పటికి మర్చి పోలేను అంటూ ప్రియాంక చోప్రా తన సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది.

నిక్‌ ది అమెరికా కనుక పెళ్లి వేడుకలు అక్కడ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయితే పెళ్లి మాత్రం సాంప్రదాయ బద్దంగా రాజస్థాన్‌ లోని కోటలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అతి కొద్ది మంది ప్రముఖ వ్యక్తులు - సినీ సెలబ్రెటీలు - మరియు రాజకీయ నాయకులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారట. వివాహ వేడుకను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు పీసీ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ తారా తోరణం పీసీ పెళ్లి వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది.