Begin typing your search above and press return to search.

గ్లాస్ తలకేసి కొట్టుకున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   24 Feb 2018 3:30 PM GMT
గ్లాస్ తలకేసి కొట్టుకున్న స్టార్ హీరోయిన్
X
ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ కు వెళ్లాక చాలా వైల్డ్ గా త‌యారైన‌ట్టు క‌నిపిస్తోంది. అందంగా క‌నిపించే ఆమె వెనుక మ‌రో క్రూర‌మైన వ్య‌క్తిత్వం కూడా ఉందా అనిపించే ప్ర‌వ‌ర్తిస్తోంది. లేకుంటే ఆ ఇన్‌ స్ట్రాగ్రామ్ పోస్టేంటీ? ఆ వీడియో ఏంటీ?

ప్రియాంక చోప్రా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఆమె చేసిన ప‌ని విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. వైన్ గ్లాస్‌ లో డ్రింక్ తాగేశాక‌... ఆ గ్లాస్‌ ను నెత్తికేసి కొట్టుకుని ప‌గుల గొట్టింది ప్రియాంక‌. ఆ వీడియోతో పాటూ ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అలుపెర‌గ‌క ప‌నిచేసిన‌ట్టు అర్థం వ‌చ్చేలా క్యాప్ష‌న్ పెట్టింది. ఆ రోజును ఒక బ్యాడ్ డే అని ప్ర‌స్తావించింది. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు అవాక్క‌య్యారు. ఇలాంటి ప‌నులు చేయొద్దంటూ కొంద‌రు హిత‌వు ప‌లికారు. పిచ్చి దానివైపోయావా అని ఒక‌రు, మీరు అంద‌రికీ రోల్ మోడ‌ల్‌.. ఇలాంటి వీడియోలు పోస్టు చేయొద్ద‌ని మ‌రొక‌రు కామంట్లు పెట్టారు. మ‌రికొంద‌రు అభిమానులు... మీరు బాగానే ఉన్నారా మేడ‌మ్ అంటూ ప్రేమ ఒల‌క‌బోశారు.

పాపం అభిమానులు పీసీ దృఢ‌మైన గ్లాస్‌ తో కొట్టుకుందేమోనని అనుకుని ఉంటారు. ప్రియాంక మాత్రం బ్రేక‌బుల్ గ్లాస్ కొట్టుకుని ఓవ‌రాక్ష‌న్ చేస్తోంది. లేకుంటే గ్లాస్ ఇలా కొడితే అలా వెంట‌నే ప‌గిలిపోతుందా... అందులోనూ ఆమెకు ఎలాంటి గాయం కాకుండా. ఇలాంటి ఓవ‌రాక్ష‌న్ సీన్లు చేసి అభిమానులు కంగారు పెట్టేస్తోంది పీసీ. క్వాంటికో సిరీస్ ఇలాంటి యాక్ష‌న్ సీన్లు చేసి అలవాటు అయిపోయిన‌ట్టుంది.