Begin typing your search above and press return to search.

వంద కోట్ల ఇల్లు కొంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   28 Oct 2016 1:30 AM GMT
వంద కోట్ల ఇల్లు కొంటున్న హీరోయిన్
X
ఆ మధ్య స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబయిలో రూ.30 కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొంటే ఔరా అనుకున్నారు. ఆ తర్వాత కోహ్లి తన రేంజి చూపిస్తూ రూ.40 కోట్ల దాకా ఖర్చు పెట్టి ముంబయిలోనే మరో ఫ్లాట్ కొన్నాడు. ఐతే వీళ్లిద్దరూ ప్రియాంక చోప్రా ముందు దిగదుడుపే అని చెప్పాలి. ఆమె ఏకంగా రూ.100 కోట్లు పెట్టి ముంబయిలో ఓ ఇల్లు కొనేస్తోంది. అంధేరిలోని ఓ రిచ్ ఏరియాలో రూ.100 కోట్లకు లగ్జరీ హౌజ్ సొంతం చేసుకుంటోందట ప్రియాంక. ఓ బడా బాబు నుంచి ఈ ఇల్లు కొంటున్న ప్రియాంక.. దాన్ని తన టేస్టుకు తగ్గట్లు రీమోడల్ చేయించుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతోందట ప్రియాంక.

ప్రపంచ సుందరి అయిన వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. మొదట్లో కొంచెం స్ట్రగుల్ అయింది కానీ.. ఆ తర్వాత అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కంటే పెద్ద రేంజికి వెళ్లిన హీరోయిన్ల కంటే కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ పేరే సంపాదించింది ప్రియాంక. ఆమె చేసిన అమెరికన్ టీవీ కార్యక్రమం ‘క్వాంటికో’తో మామూలు పేరు రాలేదు. హాలీవుడ్ హీరోయిన్లతో సమానంగా పేరు సంపాదించింది ఆమె. ఒక్కో ఎపిసోడ్ కు కొన్ని కోట్ల రూపాయల పారితోషకం ఇస్తున్నారామెకు. హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రియాంకకు అవకాశాలు వస్తున్నాయి. ఈ దెబ్బకు కొన్నాళ్లుగా హిందీ సినిమాలకు డేట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలోనే ఆమె ఏకంగా రూ.100 కోట్లు పెట్టి ఇల్లు కొనేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/