Begin typing your search above and press return to search.
పీసీ గోరింట పండితే కడుపు పండినట్టే!
By: Tupaki Desk | 14 Oct 2022 1:57 PM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట డిసెంబర్ 2018లో జోధ్ పూర్ - ఉమైద్ భవన్ ప్యాలెస్ లో క్రిస్టియన్ - హిందూ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న జంటగా పాపులరయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా గర్వపడుతున్నారు. సరోగసీ కిడ్ మాల్టీ మేరీ చోప్రా జోనాస్ ఈ దంపతుల జీవితాల్లో ఆనందం నింపింది.
పీసీ నిజానికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ప్రతిసారీ తన వ్యక్తిగత వృత్తిగత విషయాలతో అభిమానులను అప్ డేట్ చేస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా కర్వా చౌత్ జరుపుకుంది. శుక్రవారం నాడు సోషల్ మీడియాలో కర్వా చౌత్ శుభాకాంక్షలను షేర్ చేసింది. ప్రస్తుతం నిక్ తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న ప్రియాంక గోరింట ధరించిన చేతుల ఫోటోను షేర్ చేసింది. అందులో నిక్ జోనాస్ పేరును తన మెహెందీలో ఆవిష్కరించింది.
మరోవైపు పీసీ ఎరుపు రంగు చీరలో భర్తతో కలిసి అద్భుతంగా కనిపించింది. నిక్ సహా ప్రతి ఒక్కరికీ కర్వాచౌత్ శుభాకాంక్షలు అని రెడ్ హార్ట్ ఎమోజిని కూడా జోడించింది. అయితే ఓ ఫోటోలో తన ముఖం చూపకుండా దాచేసింది. పీసీ తన చేతులను మాత్రమే ఆవిష్కరించింది.
ప్రియాంక చోప్రా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి విడుదలకు అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు సిద్ధమవుతున్నాయి. ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ షో `సిటాడెల్`లో తదుపరి పాత్రలో నటించనుంది. ప్రియాంక సామ్ హ్యూఘన్ సెలిన్ డియోన్ సరసన `ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి` కూడా ఉంది. దీనికి గతంలో `టెక్స్ట్ ఫర్ యు` అని పేరు పెట్టారు. 2016లో విడుదలైన జర్మన్ చిత్రం SMS ఫర్ డిచ్ కి రీమేక్ చిత్రమిది.
కత్రినా కైఫ్ అలియా భట్ లతో కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో `జీ లే జరా`లో కూడా ప్రియాంక నటించనుంది. సోనాలి బోస్ దర్శకత్వం వహించిన 2019 చిత్రం `ది స్కై ఈజ్ పింక్` తర్వాత ఆమె హిందీ తెరకు తిరిగి రావడం కూడా ఇదే. ఇందులో ఫర్హాన్ అక్తర్- జైరా వాసిమ్- రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు.
విక్ క్యాట్ కర్వా చౌత్ వేడుకలు ..
కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ గత సంవత్సరం డిసెంబర్ లో తమ వివాహానంతరం మొదటి కర్వా చౌత్ ను జరుపుకున్నారు. బాలీవుడ్ లోని చాలా మంది జంటల మాదిరిగానే కత్రినా- విక్కీ కూడా వారి తల్లిదండ్రులతో పాటు సాంస్కృతిక ఆచారాలలో పాల్గొన్నారు. తాజాగా లవ్ బర్డ్స్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియాల్లో కర్వా చౌత్ వేడుకల నుంచి సంతోషకరమైన ఫోటోలను అభిమానులు అనుచరుల కోసం షేర్ చేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.