Begin typing your search above and press return to search.

30 నిమిషాలకు 12 కోట్లివ్వాలంట

By:  Tupaki Desk   |   17 Nov 2017 6:13 AM GMT
30 నిమిషాలకు 12 కోట్లివ్వాలంట
X
బాలీవుడ్ హీరోలకు ఏ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఉంటాయో అందరికి తెలిసిందే. అంతే కాకుండా అనుకున్నదానికంటే సినిమా కలెక్షన్స్ ఎక్కువ వస్తే పర్సెంటేజ్ లు కూడా అందుకుంటారు. ఇప్పుడు కొడితే మినిమమ్ 300 కోట్ల బాక్స్ ఆఫీస్ ని ఈజీగా దాటించాలని హీరోలు సినిమాలతో పోటీ పడుతున్నారు. అయితే వీరితో నటించే హీరోయిన్లకు కూడా అదృష్టం బాగానే ఉంది.

వారు కూడా ఈ మధ్యన హీరోల లెవెల్లో రెమ్యునరేషన్స్ ని అడిగేస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక చోప్రా అయితే అడుగుపెట్టడానికి కూడా కోట్లలో పేమెంట్ కావాలంటోందట. డిసెంబర్ లో జరగబోయే ఒక అవార్డ్స్ వేడుకలో అమ్మడు డాన్స్ చేయమన్నందుకు 12 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. కేవలం 30 నిమిషాలకే ఈ స్థాయిలో అడుగుతోందంటే ప్రియాంక ఎంత డెవలప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటోంది. కొన్ని హాలీవుడ్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. బాలీవుడ్ లో పెద్ద ఆఫర్స్ వస్తేనే చేస్తోంది అది కూడా రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తేనే ఒకే చేస్తోందని బాలీవుడ్ లో టాక్ బాగా వినిపిస్తోంది.