Begin typing your search above and press return to search.
పీసీ రికార్డ్.. ఏడాదిలో కోటి పెరిగింది.. 9 తగ్గింది
By: Tupaki Desk | 2 July 2021 11:50 AM GMTఒకప్పుడు సెలబ్రెటీలకు కేవలం నటించగా వచ్చిన పారితోషికమే ఆదాయ వనరు. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. యాక్టింగ్ మాత్రమే కాకుండా మోడలింగ్.. బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం ఇంకా ఎన్నో రకాలుగా కూడా సెలబ్రెటీలు సంపాదిస్తున్నారు. ఒక్కో సెలబ్రెటీ నాలుగు చేతుల సంపాదిస్తున్నారు. ఇక పాపులారిటీని బట్టి ఆ సంపాదన ఉంటుంది. ఇండియాలో అత్యధిక సంపాదన కలిగి ఉన్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. హీరోలు పారితోషికాల విషయంలో ముందు నిలుస్తుంటే హీరోయిన్స్ సోషల్ మీడియా సంపాదనలో ముందు ఉంటున్నారు. వారి సోషల్ మీడియాలో పదుల కొద్ది మిలియన్ ల ఫాలోవర్స్ ఉండటం వల్ల ఒక్క ప్రమోషన్ పోస్ట్ కు లక్షలు కోట్లలో పారితోషికంగా తీసుకుంటున్నారు.
హాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తగ్గకుండా మన స్టార్స్ కూడా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక చోప్రా మరియు విరాట్ కోహ్లీలు అద్బుతమైన సంపాదన కలిగి ఉన్నారు. గత ఏడాది లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒక్క యాడ్ ను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేయాలంటే రెండు కోట్ల పారితోషికం తీసుకునేది. అత్యధిక ఇన్ స్టా ఆదాయంను కలిగి ఉన్న స్టార్స్ లో గత ఏడాది 19వ స్థానంలో నిలిచింది. కాని ఏడాది తిరిగే వరకు లెక్కలు చాలా మారాయి. తన ఇన్ స్టా ఆదాయం విషయంలో పూర్తిగా మార్పు వచ్చింది.
ఆమె ప్రస్తుతం ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అంత మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నందున ఈమె ఒక్క ప్రమోషనల్ పోస్ట్ కు గాను ఏకంగా మూడు కోట్ల పారితోషికం తీసుకుంటుందట. గత ఏడాదితో పోల్చితే ఏకంగా కోటి రూపాయలు పెంచిన ప్రియాంక చోప్రా ర్యాంకు విషయంలో మాత్రం 9 స్థానాలు కోల్పోయి ఈ ఏడాది లో 27వ స్థానంకు నిలిచింది. ప్రియాంక చోప్రా కంటే ఎక్కువ ఇన్ స్టా ఆదాయంను 26 మంది కలిగి ఉన్నారు. ఈమెకే ఒక్క పోస్ట్ కు మూడు కోట్లు అంటే ఆ 26 మంది వసూళ్లు చేస్తున్న మొత్తం ఎంతో అని ఊహించుకుంటేనే షాకింగ్ గా ఉంది కదా.. నెం.1 స్థానంలో ఉన్న వ్యక్తి పది కోట్లకు తగ్గకుండా ఒక్కో పోస్ట్‌కు తీసుకుని ఉంటాడు.
ఇక మన ఇండియన్ క్రికెటర్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 19 స్థానంలో ఉన్నాడు. ఈయన పోస్ట్ కు కూడా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత హాలీవుడ్ లో నటిగా గుర్తింపు దక్కించుకుంది. గ్లోబల్ స్టార్ డమ్ తో పాటు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకోవడం వల్ల కూడా ఈమె చాలా ఫేమస్ అయ్యింది.
అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈమెను అత్యధికులు ఇన్ స్టా లో ఫాలో అవుతున్నారు. ముందు ముందు ఈమె ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య వంద మిలియన్ లకు చేరడం ఖాయం గా నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఒక్క పోస్ట్ కు పది కోట్ల వరకు కూడా తీసుకుంటుందనే అంచనాను కొందరు వేస్తున్నారు. మొత్తానికి ఇండియా నుండి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నిలవడం అభినందనీయం.