Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: సరదా మెట్ గాలా.. సూపర్ గా ఉందిగా!
By: Tupaki Desk | 5 May 2020 10:50 AM GMTగ్లోబల్ సుందరిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. నిక్ జోనాస్ తో వివాహం తర్వాత అక్కడే సెటిల్ అయింది. ఎంత గ్లోబల్ సుందరిగా మారినప్పటికీ ప్రియాంకకు భారత దేశంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి అప్డేట్ ఇచ్చినా అది వెంటనే వైరల్ గా మారుతుంది. తాజాగా ప్రియాంక ఇచ్చిన ఒక అప్డేట్ అలాగే అందరినీ ఆకర్షించింది.
ప్రతి ఏడాది మే నెలలో మొదటి సోమవారం మెట్ గాలా ఈవెంట్ జరుగుతుంది. న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ కు పలువురు హాలీవుడ్ నటీనటులు హాజరవుతారు. హాలీవుడ్ నటీనటులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి సెలబ్రిటీలు హాజరై రెడ్ కార్పెట్ పై నడిచి ఫ్యాషన్ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. ఈసారి కరోనా క్రైసిస్ కారణంగా మెట్ గాలా ఈవెంట్ ను వాయిదా వేశారు. దీంతో ప్రియాంక చోప్రా మెట్ గాలా ఈవెంట్ ను సరదాగా ఇంట్లోనే నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఏడాది థీమ్ 'ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్' అని వెల్లడించింది.
ఈ థీమ్ లో భాగంగా ప్రియాంకకు చిన్న పాప స్కై కృష్ణ మేకప్ చెయ్యడం విశేషం. ఇక ఈ ఫోటోలలో ప్రియాంక డెనిమ్ రాప్ అరౌండ్ డ్రెస్ ధరించింది. స్కై తన తలపై ఒక కీరీటం పెడుతుంటే ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పుడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లాంటిది ఇవ్వడం గమనార్హం. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఫోటోను పోస్ట్ చేసిన ఎనిమిది గంటల్లోనే 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. నిజం మెట్ గాలా డ్రెస్సులు.. ఆ మేకప్ కంటే ఈ ఉత్తుత్తి మెట్ గాలా సరదా మేకప్ అదిరిపోయిందని కొందరు కామెంట్ చెయ్యడం కొసమెరుపు.