Begin typing your search above and press return to search.

ప్రియాంక అలా కవర్ చేసిందిలే

By:  Tupaki Desk   |   22 Dec 2017 4:00 PM IST
ప్రియాంక అలా కవర్ చేసిందిలే
X
సినీ ప్రపంచంలో రెమ్యునరేషన్ అనే పదం ఈ రోజుల్లో చాలా కాస్ట్లీగా వినిపిస్తుంటోంది. తారలు అందుకుంటున్న మొత్తాన్ని చూస్తుంటే అసలు అంత డబ్బును ఎలా ఇస్తారు అనే విషయాన్ని మధ్యతరగతి కుటుంబం వాడు ఆలోచించుకోకుండా ఉండలేడు. నిమిషాలకే కోట్ల రూపాయలను అందుకునే తారలు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. అందులో ప్రియాంక చోప్రా కూడా ఉంది.

అమ్మడు బాలీవుడ్ టూ హాలీవుడ్ కెరీర్ బాగానే సాగుతోంది. ఇక్కడ సినిమాలను చేస్తూనే ఇంగ్లీష్ అలవాట్లను బాగా నేర్చేసుకుంది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా నటించడమే కాకూండా కోట్లల్లో రెమ్యునరేషన్ ని అందుకుంటోంది. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రిన్ పై అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్స్ లలో ప్రియాంక టాప్ లో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రియాంక ఇటీవల ఒక డ్యాన్స్ షోకి వచ్చి 6 నిముషాలు పెర్ఫామెన్స్ చేయమన్నందుకు రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందని కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అమ్మడు ఇటీవల అందుకు సంబందించిన ప్రస్తావన తన దగ్గరకు రావడంతో చాలా తెలివిగా సమాధానం చెప్పింది. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడను కూడా అంటూ.. మరో విషయాన్ని చెప్పింది. 6 నిముషాలు కాదు 12 నిముషాల పాటు పెర్ఫెమెన్స్ చేయబోతున్నా. అది చాలా కష్టంతో కూడుకున్న ప్రదర్శన. బుర్జ్ ఖలీఫా పై నుంచి దాదాపు 700 మీటర్లు కిందకు జారాలని వివరణ ఇచ్చింది. దీంతో అభిమానులు కొత్త తరహా కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక సంపదన గురించి కాకుండా సమయం గురించి చెప్పి బాగానే కవర్ చేసిందని అంటున్నారు.