Begin typing your search above and press return to search.
ఇంతకీ ప్రియాంక ఏం చూపిస్తోంది!?
By: Tupaki Desk | 3 May 2018 10:25 AM GMTబాలీవుడ్లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా ప్రియాంక చోప్రా తీరు వేరు. ఛామన ఛాయతోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని పట్టుకొచ్చిన ఈ సుందరాంగి... ఇప్పుడు హాలీవుడ్ లో తన సత్తా చూపిస్తోంది. ఒక భారతీయ నటికి హాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు రావడమంటే ఆశ్చర్యమే. అందుకే ఇప్పుడామె వరల్డ్ సూపర్ హాట్ స్టార్. అందుకు తగ్గట్టే డ్రెస్సింగ్ లోనూ చమక్కులు చూపిస్తోంది ప్రియాంక.
ప్రస్తుతం ఆమె క్వాంటికో ఆంగ్ల టీవీ షో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా న్యూయార్క్ నగరంలో మీడియాకి దర్శనమిచ్చింది ప్రియాంక. పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని... వైట్ కలర్ హ్యాండ్ బ్యాగుతో యమా స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చింది ప్రియాంక. క్వాంటికో ప్రోగ్రామ్ థీమ్ ని ప్రతిబింబించేలా పిల్లి కళ్లను పోలినట్టుగా డ్రెస్సుకి రెండు పక్కలా రెండు రంధ్రాలు చేశారు. అయితే ఆ రంధ్రాలు కరెక్టుగా ఎద అందాలకు కొద్దిగా పైన ఉన్నాయి. ఆ కింది భాగం కూడా పారదర్శకంగా ఉండడంతో ఎద సోకులు కనిపించీ కనిపించనట్టు కనిపించేస్తున్నాయి. దీంతో గ్లామర్ ప్రియులకు ప్రియాంక ఫ్యాషన్ తెగ నచ్చేసింది.
తన ‘ఫ్యాషన్’ తో భారతీయులందరినీ కట్టిపడేసిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ...ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ఇల్లుకొనుక్కుని నివాసం ఉంటోంది. ఇదే రేంజ్ లో రెచ్చిపోతే భవిష్యత్తులో వరల్డ్ వైడ్ గా అమ్మడి క్రేజ్ మరింత పెరిగి పోవడం పక్కా! అంటున్నారు ఫ్యాషన్ ప్రపంచ నిపుణులు.
ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి