Begin typing your search above and press return to search.
యంగేజ్ మెంట్ రింగ్ దాచేసింది!
By: Tupaki Desk | 30 July 2018 5:44 AM GMTఅమెరికా - బ్రిటన్ లో కెరీర్ పుణ్యమా అని పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా లైఫ్ టైమ్ జాక్ పాట్ కొట్టేసింది. ఇండియాలో ఉంటే లైఫ్ లో సెటిలయ్యేదో లేదో తెలీదు కానీ, విదేశాలు వెళ్లి మా గొప్ప ఘనకార్యం తలపెట్టింది. ఆ ఘనకార్యం పేరే నిక్ జోనాస్. బ్రిటన్ నటుడు నిక్ తో నెలలతరబడి డేటింగ్ సాగించిన పీసీ చివరికి నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుంది. వన్ ఫైన్ డే పీసీ బర్త్ డే రోజు నిక్ జోనాస్ తనకు ప్రపోజ్ చేయడమే గాక నిశ్చితార్థపు అంగుళీకంని తొడిగేశాడు. అసలింతకీ ఈ అంగుళీకంను ఎక్కడ కొన్నాడో తెలుసా? న్యూయార్క్ లోని ఖరీదైన టిఫానీ స్టోర్ లో అతడు ఈ రింగ్ ని కొన్నాడు.
అదంతా సరే.. ఇంతకీ ఆ రింగ్ పీసీ వేలికి ఉందా? లేదా? అంటే ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. నిక్ జోనాస్ తో పాటు ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి అది మాయమైంది. పీసీ ఇలా విమానం దిగిందో లేదో అలా కెమెరా కళ్లు అమ్మడి చేతి వేలి ఉంగరంపై పడ్డాయి. ఇంకేం ఉంది చకచకా ఆ ఉంగరంపై ఫ్లాష్ లు మెరిసాయి. ఆ హడావుడి చూసి బెదిరిపోయిన పీసీ వెంటనే ఆ ఉంగరాన్ని వేలి నుంచి తొలగించి దాచేసింది. తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోనన్న భయంతోనే అలా చేసి ఉండొచ్చు. ఇకపోతే ఉన్నట్టుండి పెళ్లి అంటే తనకు భారీ అవకాశాలు చేజారొచ్చు కాబట్టి ఇలా చేసిందా? పెళ్లి బాజా మోగే వేళ ఇంకా సందేహమేలా? పీసీ తన ప్రియుడు నిక్ ని అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లాడే ఛాన్సుందని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అదంతా సరే.. ఇంత జరిగాక కూడా పీసీ ఇంకా ఎందుకిలా నిశ్చితార్థపు ఉంగరం దాచేస్తోంది? ఇటీవలే సల్మాన్ `భరత్` సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా డిక్లేర్ చేసేశాక కూడాను?