Begin typing your search above and press return to search.

పీసీ ఇంకా బేబీని ఇలా దాచేస్తూనే ఉంది..!

By:  Tupaki Desk   |   23 July 2022 4:56 AM GMT
పీసీ ఇంకా బేబీని ఇలా దాచేస్తూనే ఉంది..!
X
గ‌త కొద్దిరోజులుగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా తన 40వ పుట్టినరోజు వేడుక‌ల్లో త‌ల‌మున‌క‌లుగా ఉంది. భర్త నిక్ జోనాస్ స‌హా కుటుంబస‌భ్యులు- స్నేహితులతో కలిసి మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ లో ఈ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈసారి వెకేష‌న్ లో బీచ్ స్పోర్ట్స్ స‌హా ర‌క‌ర‌కాల క్రీడ‌ల్లోనూ ఈ జంట పాల్గొన్నారు. గోల్ఫ్ క్రీడ‌తో పాటు బీచ్ పూల్ లో ఎక్కువ సమయం గ‌డిపారు. ఇక బీచ్ లో పార్టీల‌కు అయితే కొద‌వేమీ లేదు. బీచ్ ట్రిప్ కోసం ప్రైవేట్ జెట్ లో ప్ర‌యాణించారు.

''జూలై రత్నానికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు... మీతో జీవితం అనే ఈ క్రేజీ రైడ్ లో ఉండ‌టాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను... '' అంటూ నిక్ జోనాస్ త‌న భార్య‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

పీసీ 40వ పుట్టినరోజు వేడుక‌ల నుంచి మ‌రికొన్ని కొత్త ఫోటోలు అంత‌ర్జాలంలో ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో ఈ జంట తమ గారాల ప‌ట్టీ మాల్టీ మేరీ 6వ నెల సెల‌బ్రేష‌న్ ని రివీల్ చేసారు. అయితే ల‌వ్ సింబ‌ల్ తో త‌న ముఖాన్ని క‌వ‌ర‌ప్ చేయ‌డం క‌నిపించింది. కేవలం ఒక చిన్నారి.. ఆమె పుట్టినరోజు టీమ్ ! అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది పీసీ. అయితే త‌న వార‌సురాలి ఫోటోల్లో ముఖాన్ని దాచేయ‌డం అభిమానుల‌కు న‌చ్చ‌లేదు. తాను ఇంకా ఎందుకు దాస్తోందో ప్ర‌శ్నించారు.

నిక్ జోనాస్ నమ్మశక్యం కాని వేడుకలను ప్లాన్ చేశార‌ని కూడా చెప్పింది పీసీ. చాలా ప్రేమతో ఈ యాత్ర‌.. నా దగ్గరి వారితో ప్రియమైన వారితో సమయాన్ని గడపగలిగినందుకు చాలా కృతజ్ఞతలు అని భార‌త‌దేశంలోని అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఈ మరపురాని పుట్టినరోజుకి ధన్యవాదాలు చెప్పడానికి పదాలు సరిపోవు... బిడ్డను ఎలా ప్రేమించాలో మీకు తెలుసు.

నేను అదృష్టం ఉన్న‌ అమ్మాయిని... అంటూ పీసీ ఎమోష‌న‌ల్ అయ్యింది. అద్భుతమైన DMలు.. సర్ప్రైజ్ లు.. కాల్ లు.. టెక్స్ట్ లు ..పెద్ద కౌగిలింతలు ఈ రోజును మ‌రింత‌ ప్రకాశవంతం చేశాయి. నాకు నిజంగా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అని అంది.

ప్రియాంక హాలీవుడ్ చిత్రం 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ'లో నటిస్తోంది. ఇది త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా న‌టిస్తోంది.