Begin typing your search above and press return to search.

పీసీ బికినీ ట్రీట్ కి బౌల్డ్ అవ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   29 April 2022 1:30 PM GMT
పీసీ బికినీ ట్రీట్ కి బౌల్డ్ అవ్వాల్సిందే!
X
నేటితరం కథానాయికల్ని వెనక్కి నెట్టేస్తూ ఇటీవల గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ట్రెండింగ్ గా మారింది. చిట్టి పొట్టి నిక్కర్లు వేడెక్కించే లిప్ లాక్ లతో పీసీ అమెరికా కోడ‌లు చేసే హంగామాను ఇంకా ఎవరూ మర్చిపోలేరు. బ్యూటీ నిరంతరం భర్త నిక్ జోనాస్ తో ప్రయివేట్ ఫోటోలను షేర్ చేస్తూ వేడి పెంచడం హాబీగా మలుచుకుంది. కొన్నిసార్లు సంథింగ్ హాట్ అనిపించే బికినీ పోటోలను కూడా షేర్ చేస్తోంది.

తాజాగా పీసీ పూల్ సెలబ్రేషన్ కి సంబంధించిన వేడెక్కించే ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా వైరల్ గా మారింది. అలా టూపీస్ బికినీలో జలకాలాడుతూ చిల్లింగ్ మూవ్ మెంట్ లో ఉండగా కెమెరా క్లిక్ మంది. పీకల్లోతు నీళ్లలో పీసీ చిద్విలాసంగా కెమెరాకు ఫోజులిచ్చింది.

ఇక వాటర్ బేబీ గ్లాసెస్ లో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తోంది. ఈ మూవ్ మెంట్స్ కి కొన్ని ఓల్డ్ సాంగ్స్ని సైతం జోడించి రెట్రో సంగీతాన్ని ఆస్వాదిస్తూ నీళ్ల‌లో జ‌ల‌కాలు ఆడుతోంది.

అమీర్ ఖాన్ -పూజా భ‌ట్ న‌టించిన చిత్రంలోని 'దిల్ హైకి మంత న‌హీన్' టైటిల్ ట్రాక్ వీడియోని అనుస‌రించింది. ఆ త‌ర్వాత‌ జ‌యాబ‌చ్చ‌న్-సంజీవ్ కుమార్ న‌టించిన 'అనామిక' సినిమా లో'బ‌హోన్ మే చ‌లో ఆవోని' పాట‌ని వింటుంది. ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

''మీరు ఊహించ‌ని కొన్ని గంట‌ల స్వీయ సంర‌క్ష‌ణ సౌండ్ ఆన్ లో ఉన్న‌ప్పుడు. నేను వింటున్న‌ పాట‌ల్ని మీరు గుర్తించ‌గ‌ల‌రా? అని రాసుకొచ్చింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రియాంక చోప్రా చివరిగా కీను రీవ్స్ ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ లో కనిపించింది. హాలీవుడ్ లో తదుపరి సిటాడెల్ రిలీజ్ కి రానుంది. రొమాంటిక్ కామెడీ 'టెక్స్ట్ ఫర్ యు'లో సామ్ హ్యూగన్ సరసన నటించనుంది. బాలీవుడ్ లో ప్రియాంక తదుపరి ఫర్హాన్ అక్తర్ జీ లే జరాలో కనిపిస్తుంది. ఆలియా భట్- కత్రినా కైఫ్ లతో కలిసి ఈ చిత్రంలో నటించనుంది.