Begin typing your search above and press return to search.
ఇంత దిగజారాలా ప్రియాంకా
By: Tupaki Desk | 10 Jun 2018 5:14 AM GMTఏరు దాటాక తెప్ప తగలేయ్యడం అంటే ఏంటో కొందరు బాలీవుడ్ హీరోయిన్లను చూసి చెప్పొచ్చు. భారతీయ సినిమాల్లో నటించి లెక్కలేనంత పేరు సంపద వచ్చాక రెండు మూడు హాలీవుడ్ అవకాశాలు రాగానే కళ్ళు నెత్తికెక్కతున్నాయి. ఎంతగా అంటే ఇండియన్ సినిమా గురించి అంతర్జాతీయంగా పరువు తీసే స్థాయిలో. ప్రియాంకా చోప్రా చేస్తోంది ఇదే. ఇటీవలే క్యాంటికో అనే టెలివిజన్ సిరీస్ చేసిన ప్రియాంకా ఆ మాత్రానికే తానేదో ఇంటర్నేషనల్ స్టార్ లా ఫీల్ అయిపోతోంది. ఇటీవల జరిగిన 68వ ఎమ్మి అవార్డ్స్ వేడుకల్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారతీయ సినిమాలన్నీ హిప్స్ అండ్ బూబ్స్ చుట్టే తిరుగుతాయని అసభ్యకర రీతిలో కామెంట్ చేయటమే కాక తన శరీరంలో వాటిని పదే పదే వయ్యారంగా పట్టుకుని చూపిస్తూ ఎగతాళి చేయటం ఇప్పుడు సినిమా ప్రేమికులను ఆగ్రహానికి గురి చేస్తోంది. బాజీరావు మస్తానీ-ఫ్యాషన్-క్రిష్ లాంటి సినిమాల్లో తనకు టాలెంట్ చూపించుకునే అవకాశం ఇచ్చినవి ఏ దేశపు సినిమాలో చెప్పాలని నిలదీస్తున్నారు.
హిందువుల్లోనే టెర్రరిస్టులు ఉన్నారనేలా పాకిస్థాన్ ను సమర్థిస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్న క్యాంటికోలో నటించడం పట్ల ఇప్పటికే ప్రియాంకా మీద జనం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇంత లోపు ఈ వీడియో బయటికి రావడంతో తన మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అసలు ఇంత దిగజారుడు తనంగా గతంలో ఎవరు అనలేదని తనకు తాను ఆస్కార్ రేంజ్ నటిగా ప్రియాంకా భ్రమపడితే అది అమాయకత్వమే అంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి ప్రియాంకా హాలీవుడ్ మైకంలో మునిగితేలుతోంది. ఇక తన భవిష్యత్తు అక్కడే అనే రీతిలో చాలా ఓవర్ చేస్తోంది. ప్రియాంకా నటించి షూటింగ్ పూర్తి చేసుకున్న రెండు ఇంగ్లీష్ సినిమాలు విడుదలకు నోచుకోనే లేదు. వచ్చినా వాటిని ఎవరూ అడిగే పరిస్థితి లేదు. రెండు సీజన్లకే రేటింగ్స్ రాక చాప చుట్టేసిన క్యాంటికోని ఇప్పటికే ఆపేసారు. ఎంత విదేశీ లవర్ ఉన్నంత మాత్రాన మూలాలున్న భారతీయత గురించి ఇంత నీచంగా కామెంట్స్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో కొందరు సల్మాన్ ఖాన్ కు రిక్వెస్ట్ పెడుతూ ఇప్పుడు తీస్తున్న భరత్ నుంచి ప్రియాంకాను తప్పించమని కోరుతూ మెసేజులు పెడుతున్నారు. ఇది ఇంకా వివాదాస్పదం అయ్యే సూచనలు ఉన్నాయి.