Begin typing your search above and press return to search.

కుమార్తె గురించి ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   14 April 2022 11:30 PM GMT
కుమార్తె గురించి ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X
బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా- త‌న‌క‌న్నా ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వివాహం అనంత‌రం జంట అమెరికాలో కాపురం పెట్టింది. పీసీ హాలీవుడ్ కి ప్ర‌మోట్ అవ్వ‌డం స‌హా వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తుడ‌టంతో పాటు...భ‌ర్త కూడా అక్క‌డే రాణించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఇలా కెరీర్ ప‌రంగా అమెరికాలో అయితేనే బాగుంటుంద‌ని జంట అక్క‌డే స్థిర‌ప‌డ్డారు.

మ‌రి ఈ జంట ఇంకా పిల్ల‌లు ప్లాన్ చేయ‌లేదా? ఇంకా కెరీర్ పైనే ప‌రుగులు పెట్టే ప్లాన్ లోఉన్నారా? అంటే క్లారిటీ మిస్ అవ్వుతాంగానీ..ఇటీవ‌లే స‌రోగ‌సి విధానం ద్వారా ప్రియాంక చోప్రా తల్లి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ విధానం పీసీ కుమార్తె కు తల్లిగా మారింది. అయితే ఈ విష‌యాలేవి పీసీ ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డించ‌లేదుగానీ కుమార్తె పెంప‌కంపై మాత్రం ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసింది.

''కొత్త‌గా త‌ల్లిన‌య్యా. త‌ల్లులు అంద‌రిలాగే నాకు పెంప‌కం విష‌యంలో కొన్ని భ‌యాలున్నాయి. కానీ వాటిని నా కుమార్తె పై రుద్ద‌ను. పిల్ల‌లు మీ ద్వారా వ‌స్తారు. కానీ మీ నుంచి కాదు.

అందుకే వాళ్ల‌ని అన్నింట్లో కంట్రోల్ చేయాల‌నే విష‌యాన్ని నేను న‌మ్మ‌ను. జీవితం గురించి తెలుసుకోవ‌డానికి..దాన్ని నిర్మించుకోవ‌డానికి వారు మీరు ఒక వాహకం మాత్ర‌మే. అది నాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఎందుకంటే నా త‌ల్లిదండ్రులు అదే విధంగా న‌న్ను పెంచారు అని పీసీ తెలిపింది.

''నా కుమార్తెకు ఏ పేరు పెట్టాలో తెలియ‌లేదు. తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాను. కానీ ఆపేరుకి ఓ ప్రత్యేక‌త ఉండాల‌ని బ‌లంగా కోరుకున్నాం. ఇంతవ‌ర‌కూ అంత‌టి అద్భుత‌మైన పేరు త‌ట్ట‌లేదు. మా ఇద్ద‌రికి న‌చ్చే పేరుని పాప‌కి పెడ‌తామ‌ని'' తెలిపింది. మొత్తానికి పీసీ త‌ల్లి అయింది. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు స‌రోగ‌సీ విధానంలోనే పిల్ల‌లు క‌న‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు.

అందుకు చాలా ర‌కాల కారాణ‌లు ఉన్నాయి. కొన్ని ఆరోగ్య ప‌రంగా వ్య‌క్తిగ‌త‌మైతే..మ‌రికొన్ని గ్లామ‌ర్ ఫీల్డ్ ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న కార‌ణంగా స‌రోగ‌సి విధానానికి పెద్ద పీట వేస్తున్నారు. స‌రోగ‌సి అంటే..''సరోగసీ అనేది సహాయక పునరుత్పత్తి-ఆధారిత విధానం. దీనిలో ఉద్దేశించిన తల్లిదండ్రులు సర్రోగేట్ మదర్ అని పిలువబడే మరొక స్త్రీకి గర్భధారణ జననాన్ని అప్పగిస్తారు.