Begin typing your search above and press return to search.

భర్త గురించి ఎన్ని గొప్పలు చెప్పిందో?

By:  Tupaki Desk   |   13 April 2019 5:44 AM GMT
భర్త గురించి ఎన్ని గొప్పలు చెప్పిందో?
X
ప్రేమించి పెళ్లి చేసుకోవటం అందరూ చేస్తుంటారు. ఆ కోవకే చెందుతారు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక. అయితే.. తన కంటే చాలా చిన్నోడ్ని ప్రేమించటం ఒక ఎత్తు.. పెళ్లి చేసుకోవటం మరో ఎత్తు. పెళ్లి తర్వాత తన భర్తకు తానెక్కడ ప్లాట్ అయ్యానో చెప్పిన ప్రియాంక మాటలు ఆసక్తికరంగా మారాయి.

విషయం ఏదైనా సరే..బోల్డ్ గా చెప్పేసే బ్యూటీ ప్రియాంక. అలాంటి ఆమె.. తాను నిక్ తో డేటింగ్ లో ఉండగా.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆమెకు అస్సలు రాలేదట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఉమెన్ ఇన్ ది వరల్డ్ సదస్సులో భాగంగా వెల్లడించింది.

తన భర్త గురించి గొప్పలు చెప్పిన ఆమె.. నిక్ మంచితనంతో తానెలా ప్లాట్ అయ్యానో చెప్పుకొచ్చింది. నిక్ తో డేటింగ్లో ఉన్న తొలి రోజుల్లో అతడి గురించి తనకున్న అంచనాలు వేరని.. స్లోగా అతడేంటో తనకు తెలిసిందన్నారు. నిక్ ఎంతో మంచి మనిషి అని.. చూసేందుకు నేటి తరం అబ్బాయిలా ఉన్నా మనసు మాత్రం పాత తరం బంగారంగా కీర్తించారు.

ప్రతి సందర్భంలోనూ తనకు తోడుగా ఉన్నాడని.. పుస్తకం కవర్ పేజీ చూసి బుక్ ను అంచనా వేసినట్లు నిక్ విషయంలో తాను చేసి ఉంటే.. అతడు తన జీవితంలోకి వచ్చేవాడే కాదన్నారు. తానో భయంకరమైన అమ్మాయినని.. తనకు ఏది నచ్చితే అది చేస్తుంటానని.. ఎప్పుడంటే అప్పుడు చేసే అలవాటుందన్నారు. అలాంటి వేళలోనే నిక్ తనవెంటే ఉంటారన్నారు.

తనను ఎంతగా గౌరవిస్తాడో.. తన పనిని అంతగానే గౌరవిస్తాడని చెప్పిన ప్రియాంక.. ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఒకరోజు తాను స్పెషల్ మీటింగ్ కు వెళ్లాల్సి ఉందని.. అదే సమయంలో ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని.. అలాంటి సమయంలో తన ఫ్రెండ్స్ ను నిక్ పార్టీకి తీసుకెళ్లాడని.. తనను మీటింగ్ వెళ్లాల్సిందిగా చెప్పారన్నారు. మొత్తానికి నిక్ కు తానెలా ఫ్లాట్ అయ్యానన్న విషయాన్ని ప్రియాంక దాచుకోకుండా చెప్పేశారు కదూ?